LIC Policies Revival: మీ పాత ఎల్ఐసీ పాలసీలను ఇలా పునరుద్ధరించుకోండి, జరిమానాపై రాయితీ కూడా
LIC Policies Revival: జీవిత భీమా సంస్థ పాలసీలు దేశంలో సర్వ సాధారణం. చాలావరకూ పాలసీలు నిలిచిపోతుంటాయి. ఇప్పుడు ఎల్ఐసీ పాలసీలు డెడ్ అయినా బతికించుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఇటీవల కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఇది ఎల్ఐసీ పాలసీదారులకు నిజంగా గుడ్‌న్యూస్. ఎందుకంటే చాలావరకూ ఎల్ఐసీ పాలసీలు వివిధ కారణాలతో ఆగిపోతుంటాయి. లేదా డెడ్ అవుతుంటాయి. ఇలాంటి పాలసీలను ఇప్పుడు బతికించుకునే అవకాశాన్ని ఎల్ఐసీ కల్పిస్తోంది.
గతంలో ఎల్ఐసీ పాలసీ తీసుకుని కొద్దికాలం కట్టిన తరువాత వదిలేసుంటే..తిరిగి బతికించుకోవచ్చు. ఎల్ఐసీ భీమా పాలసీలు చాలావరకూ అర్ధంతరంగా నిలిచిపోయుంటాయి. కట్టలేక కావచ్చు..మరో ఇతర కారణం కావచ్చు కొంతకాలం కట్టిన తరవాత ఆపేస్తుంటాము. ఇలాంటి పాలసీలు రద్దయిపోతుంటాయి. ఎల్ఐసీ ఇప్పుడు అటువంటి పాలసీలను తిరిగి బతికించుకోవచ్చంటోంది.
కొద్దికాలం కట్టిన తరువాత మధ్యలో వదిలేసిన పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికోసం ఎల్ఐసీ స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. చెల్లించాల్సిన ఫైన్‌పై డిస్కౌంట్ కూడా ప్రకటించింది. ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిలో ఉన్న పాలసీలు, పాలసీ వ్యవధిని పూర్తి చేయని పాలసీలను ఇందులో పునరుద్ధరించుకోవచ్చని ఎల్ఐసీ వెల్లడించింది.
అంతేకాకుండా..ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణ ప్రీమియం మొత్తంపై ఎల్ఐసీ రాయితీ ప్రకటించింది. ఐదేళ్లుగా ఓ పాలసీను మూసివేస్తే..తిరిగి ఈ క్యాంపెయిన్ ద్వారా పునరుద్ధరించవచ్చు. దీనికి సంబంధించిన షరతులు, నిబంధనలు కూడా జారీ అయ్యాయి.
పాత పాలసీల పునరుద్ధరణపై రాయితీ ఎంత
మొత్తం పునరుద్ధరణ ప్రీమియం లక్ష రూపాయల వరకూ ఉంటే రాయితీ 20 శాతం ఉంటుంది. 1-3 లక్షల వరకూ ప్రీమియం మొత్తానికి రాయితీ 25 శాతం అంటే గరిష్టంగా 2 వేల 5 వందల రూపాయలవరకూ ఉంటుంది. ప్రీమియం మొత్తం 3 లక్షల కంటే ఎక్కువుంటే 30 శాతం రాయితీ లభించనుంది. ఇది కాకుండా ఎల్ఐసీ జీవిత భీమా ఆరోగ్య రక్షక్ పాలసీని ప్రారంభించింది. ఇది పూర్తిగా ఆరోగ్య భీమా పథకం. ఇది రెగ్యులర్ ప్రీమియం నాన్ లింక్డ్ పాలసీ. ఈ పాలసీ కింద స్థిరమైన ప్రయోజనం లభిస్తుంది.
Also read: SBI Share Price: పెరగనున్న ఎస్బీఐ షేర్ విలువ, ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook