LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రైవేటైజేషన్‌కు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అధికశాతం వాటాల్ని విక్రయించనుంది. ఇందులో భాగంగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూలో పాలసీదారులకు పదిశాతం షేర్లు కేటాయించనున్నట్టు కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్ఐసీ పాలసీదారుల ( Lic policy holders )కు కేంద్ర ప్రభుత్వం ( Central government ) శుభవార్త విన్పిస్తోంది. అవసరమైన పాలసీదార్లకు ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యు ( Lic public issue )లో పదిశాతం షేర్లను కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. పాలసీదార్లు ప్రయోజనాల్ని కాపాడే క్రమంలో ఎల్ఐసీలో ప్రభుత్వం మెజార్టీ వాటాదారుగా కొనసాగుతుందని చెప్పారు. రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో అనురాగ్ ఠాగూర్ ( Anurag thakur ) ఈ విషయాలు తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఎల్ఐసీని స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ చేయనున్నట్టు అనురాగ్ ఠాకూర్ చెప్పారు. 


ఎల్ఐసీ ( LIC ) విలువను మదింపు చేసేందుకు యాక్టువేరియల్ సంస్థ మిల్లీమన్ అడ్వైజర్స్‌ను కేంద్ర పెట్టబడులు, ప్రభుత్వ ఆస్థుల నిర్వహణ విభాగం ఎంపిక చేసింది. ప్రీ ఐపీవో లావాదేవీలకు సంబంధించి సలహాదారులుగా డెలాయిట్, ఎస్‌బీఐ క్యాప్స్‌ను నియమించింది. ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా 2021-22 సంవత్సరానికి 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్ధయించింది. 


Also read: Petrol Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు, హైదరాబాద్‌లో రికార్డు ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook