LPG Connection: ఎల్బీజీ గ్యాస్ వినియోగదారులకు మరో షాక్. ఇప్పటికే వరుసగా పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి మరో షాక్ తగిలింది. ఇప్పుడిక కొత్త కనెక్షన్ కూడా భారంగా మారనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్పీజీ గ్యాస్ ధరే కాదు..ఇప్పుడు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కూడా భారంగా మారుతోంది. ఇప్పటికే వరుసగా గ్యాస్ సిలెండర్ ధరలు పెరుగుతున్న నేపధ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరో దెబ్బ ఇది. ఇవాళ్టి నుంచి కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ మరింత భారంగా మారనుంది. ఎందుకంటే గ్యాస్ కనెక్షన్ సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. కొత్త కనెక్షన్ ధరలు ఇవాళ అంటే జూన్ 28 నుంచి అమల్లో రానున్నాయి.


కొత్త ధరల ప్రకారం ఇప్పుడిక కస్టమర్లు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ కోసం 2550 రూపాయలు కాకుండా 36 వందలు కట్టాల్సి వస్తుంది. అంటే ఏకంగా 1050 రూపాయలు పెరిగింది. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ గ్యాస్ కంపెనీ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ సెక్యురిటీ డిపాజిట్‌ను పెంచింది. ఇక 47 కిలోల గ్యాస్ కనెక్షన్ సెక్యురిటీ డిపాజిట్ కూడా పెరిగింది. ఇంతకుముందు 47 కిలోల గ్యాస్ సిలెండర్ కనెక్షన్ కోసం 6450 చెల్లించాల్సి ఉంటే..ఇప్పుడిక 7350 రూపాయలు చెల్లించాలి. అంటే 9 వందల రూపాయలు పెరిగింది. మరోవైపు 14.2 డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ కోసం 1450 రూపాయలు చెల్లించాల్సి ఉంటే..ఇవాళ్టి నుంచి 22 వందల రూపాయలు చెల్లించాలి. ఇక 5 కిలోల గ్యాస్ కనెక్షన్ ధర 1150 రూపాయలైంది. 


గ్యాస్ కనెక్షన్‌తో పాటు రెగ్యులేటర్ దర కూడా పెరిగింది. ఇప్పటివరకూ 150 రూపాయలున్న రెగ్యులేటర్ ఇక నుంచి 250 రూపాయలైంది. రెగ్యులేటర్ విరిగినా లేదా పాడైనా మార్చేందుకు 3 వందల రూపాయలవుతుంది. గ్యాస్ కనెక్షన్ సెక్యూరిటీ డిపాజిట్ పెంచడం పదేళ్ల తరువాత ఇదే. జూన్ 16 నుంచి డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ కూడా ధర పెరిగింది. ఒక్కొక్క కనెక్షన్‌పై 750 రూపాయలు పెరిగింది. ఇక ఉజ్వల గ్యాస్ కనెక్షన్ పథకంలో భాగంగా రెండవ గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే వాళ్లు కూడా పెరిగిన మొత్తం చెల్లించాలి. 


Also read: Credit Card Rules: క్రెడిట్ కార్డు కొత్త నియమాలు జూలై 1 నుంచి అమలు, పాటించకపోతే రోజుకు 5 వందలు పెనాల్టీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.