Credit Card Rules: క్రెడిట్ కార్డు కొత్త నియమాలు జూలై 1 నుంచి అమలు, పాటించకపోతే రోజుకు 5 వందలు పెనాల్టీ

Credit Card Rules: క్రెడిట్ కార్డు వినియోగంలో కీలకమైన విషయాల్ని నిర్లక్ష్యం చేస్తే చాలా నష్టాలు ఎదుర్కోవల్సివస్తుంది. ఇటీవల క్రెడిట్ కార్డు నియమాల్లో కూడా మార్పులు వచ్చాయి. ఆ మార్పులేంటి, నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుందో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 28, 2022, 04:04 PM IST
Credit Card Rules: క్రెడిట్ కార్డు కొత్త నియమాలు జూలై 1 నుంచి అమలు, పాటించకపోతే రోజుకు 5 వందలు పెనాల్టీ

Credit Card Rules: క్రెడిట్ కార్డు వినియోగంలో కీలకమైన విషయాల్ని నిర్లక్ష్యం చేస్తే చాలా నష్టాలు ఎదుర్కోవల్సివస్తుంది. ఇటీవల క్రెడిట్ కార్డు నియమాల్లో కూడా మార్పులు వచ్చాయి. ఆ మార్పులేంటి, నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుందో తెలుసుకుందాం..

ప్రస్తుతం అంతా డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా నడుస్తున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగం ఎక్కువవుతోంది. క్రెడిట్ కార్డుతో ఎన్ని ఉపయోగాలున్నాయో..కొన్ని విషయాల్ని పట్టించుకోకపోతే అంతే నష్టాలుంటాయి. జూలై 1, 2022 నుంచి క్రెడిట్ కార్డుకు సంబంధించి కొన్ని నియమాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ మార్పులేంటో తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు నిబంధనలు జూలై 1, 2022 నుంచి అమల్లో వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. ఈ నియమాల్లో బిల్ తప్పుగా రావడం, బిల్ జారీ చేసిన తేదీ, ఆలస్యంగా బిల్లు పంపించడం, క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడం వంటివి ఉన్నాయి. ఇవన్నీ జూలై 1 నుంచి అమల్లో రానున్నాయి. ఒకవేళ కంపెనీ పంపించిన క్రెడిట్ కార్డు బిల్లులో తప్పులుంటే..కస్టమర్ ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదుపై 30రోజుల్లోగా కంపెనీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. 

క్రెడిట్ కార్డు బిల్లు జారీ చేయడంలో ఆలస్యం, స్టేట్ మెంట్ పంపించడంలో ఆలస్యం ఉండకూడదని ఆర్బీఐ సూచించింది. వడ్డీ లేకుండా డబ్బులు తిరిగి చెల్లించేందుకు కార్డు గ్రహీతకు పూర్తి సమయం ఉండాలి. దీనికోసం కార్డులు జారీచేసే సంస్థలు సరైన కార్యాచరణ రూపొందించుకోవాలి. క్రెడిట్ కార్డు క్లోజ్ చేయమని దరఖాస్తు వచ్చినప్పుడు సంబంధిత సంస్థ ఏడు పనిదినాల్లోగా కార్డు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ నియమాల ప్రకారం కార్డు క్లోజ్ చేసిన తరువాత..ఈమెయిల్,  ఎస్ఎంఎస్ వంటివి వెంటనే నిలిపివేయాలి. ఒకవేళ ఏడు పనిదినాల్లోగా క్రెడిట్ కార్డు క్లోజ్ చేయకపోతే..కంపెనీ రోజుకు 5 వందల రూపాయల చొప్పున జరిమానా విధించాల్సి ఉంటుంది. 

అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు జారీ చేస్తే ఆ సంస్థలపై కఠిన చర్యలుంటాయని ఆర్బీఐ చెబుతోంది. కస్టమర్ అనుమతి లేకండా క్రెడిట్ కార్డు జారీ చేస్తే..కంపెనీపై జరిమానా ఉంటుంది. ఆర్బీఐ సూచనల ప్రకారం జూలై 1 2022 నుంచి క్రెడిట్ కార్డు బిల్లింగ్ సమయం గత నెల 11 వతేదీ నుంచి ప్రారంభమౌతుంది. ప్రస్తుతం నడుస్తున్న నెల 10వ తేదీ వరకూ ఉంటుంది. 

Also read: VI Recharge Plans: వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ఈ ప్లాన్‌తో 3 నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News