Mahindra Plans to Close Three Cars From from 2023 March 31st: కొత్త BS6 ఉద్గార నిబంధనల రెండవ దశ 2023 ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో అమలు చేయబడుతుంది. దీనిని రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) అని కూడా పిలుస్తారు. కంపెనీకు అన్ని దీనికి అనుగుణంగా ఇంజిన్‌ను అప్‌డేట్ చేయాలి. దాంతో భారతీయ మార్కెట్లో అనేక కార్లకు సవాలుగా మారింది. నూతన నిబంధనల ప్రకారం 2023 మార్చి 31న చాలా కార్లు నిలిపివేయబడనున్నాయి. ఈ జాబితాలో మహీంద్రా మరాజో, KUV100 మరియు అల్టురాస్ మోడల్స్ ఉన్నాయి. దాంతో కంపెనీ ఈ మోడళ్ల స్టాక్‌ను ఖాళీ చేస్తోంది. అయితే ఆల్టురాస్ విక్రయాలు ఇప్పటికే ఆగిపోయాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ నుంచి కొత్త ఉద్గార నిబంధనలు దేశవ్యాప్తంగా అమలు చేయబడతాయి. కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడటానికి అన్ని కార్ల కంపెనీలు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించవలసి ఉంటుంది. అయితే మహీంద్రా ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా తన మూడు మోడళ్లను అప్‌డేట్ చేయకూడదని నిర్ణయించుకుంది. దాంతో మహీంద్రా కంపెనీ  2023 మార్చి 31 నాటికి ఈ కార్ల స్టాక్‌ను క్లియర్ చేస్తోంది. ఈ నిర్ణయానికి సంబంధించి కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.


ప్రభావితమైన మోడళ్లలో ఒకటి మహీంద్రా మరాజో. ఈ కారు అమ్మకాలు ఇటీవలి నెలల్లో బాగా క్షీణించాయి. జనవరి 2023లో కంపెనీ 164 యూనిట్ల కార్లను మాత్రమే విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 956 యూనిట్లు అమ్ముడయ్యాయి. అందుకే మరాజోను అప్‌డేట్ చేయకూడదనే నిర్ణయం తీసుకుంది. మరో మోడల్ మహీంద్రా KUV100 గత కొన్ని నెలలుగా (డిసెంబర్ 2022లో) ఒక యూనిట్ మాత్రమే విక్రయించబడింది. దాంతో ఈ కారు విక్రయాలలో భారీ తగ్గుదల కనిపించింది. 


అమ్మకాలు భారీగా తగ్గిన కారణంగా కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ మహీంద్రా ఆల్టురాస్‌ను డిసెంబర్ 2022లో నిలిపివేవేసింది. కంపెనీ వాహన ఉత్పత్తిని కూడా నిలిపివేసింది. కొత్త బుకింగ్‌లను పూర్తిగా మానేసింది. మహీంద్రా  కంపెనీ ఇప్పుడు ఆల్టురాస్‌ కారు యొక్క మిగిలిన స్టాక్‌ను అమ్మడానికి చూస్తోంది. మహీంద్రా మరాజో, KUV100 మరియు అల్టురాస్ ఇష్టపడే వారు ఇప్పుడే కొనేసుకుంటే బెటర్. 


Also Read: Earthquake In India: టర్కీ, సిరియా తరహాలో.. భారత్‌కు భారీ భూకంప ముప్పు!  


Also Read: King Cobra Poison Live Video: పాయిజన్ చిమ్ముతున్న కింగ్ కోబ్రా.. లైవ్ వీడియో చూసేయండి!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook