Earthquake India, Earthquake Can hit Himachal and Uttarakhand: ఇటీవల సంభవించిన భారీ భూకంపం ధాటికి టర్కీ, సిరియా దేశాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. పలుమార్లు భూకంపం రావడంతో వేలల్లో ప్రాణ నష్టం, కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం సృష్టించిన విధ్వంసానికి ప్రపంచమంతా విస్తుపోయింది. ఇక రెండు దేశాల్లో భూకంపాన్ని ముందే గ్రహంచిన పరిశోధకులు.. భూకంపాలు వచ్చే ప్రమాదమున్న దేశాలను గుర్తించారు. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ఇండియాలో త్వరలోనే భూకంపం సంభవించే ప్రమాదముందని పరిశోధకులు అంచనా వేశారు.
టర్కీ, సిరియా దేశాల తరహాలో భారత్‌లో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) చీఫ్ సైంటిస్ట్ డా. పూర్ణచందర్ రావు తెలిపారు. భూమి పొరల్లో ఉండే ప్లేట్లు నిరంతరం కదులుతాయని, భారతదేశం భూభాగం కింద ఉన్న ప్లేట్లు సంవత్సరానికి 5 సెంటీమీటర్లు వేగంతో కదులుతున్నాయని పూర్ణచందర్ రావు పేర్కొన్నారు. ప్లేట్ల కారణంగా హిమాలయాలపై ఒత్తిడి పెరిగి.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ భూకంపం సంభవించే అవకాశం చీఫ్ సైంటిస్ట్ పూర్ణచందర్ రావు చెప్పుకొచ్చారు. ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవచ్చన్నారు.
భారత్‌లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ కాన్పూర్) పరిశోధకులు ఇటీవల వెల్లడించారు. భారీ తీవ్రత కలిగిన భూకంపాలు వచ్చే 20 ఏళ్లలో ఎప్పుడైనా సంభవించే ప్రమాదం ఉందని, హిమాలయాలు లేదా అండమాన్ నికోబార్ దీవుల కింద ఈ భూకంపాలు కేంద్రీకృతం కావచ్చని వారు తెలిపారు. ప్రభుత్వాలు నిరంతరం అప్రమత్తతతో ఉండటం చాలా అవసరం హెచ్చరించారు.
టర్కీ, సిరియాలలో భూకంపాలను అంచనా వేసిన డచ్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్‌బీట్స్.. భారత్‌లో కూడా భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అతి పెద్ద భూకంపం సంభవించవచ్చని ఆయన అంచనా వేశారు. భూకంప కార్యకలాపాలు భారత్, పాకిస్తాన్ గుండా వెళతాయని.. చివరికి హిందూ మహాసముద్రంలో ముగుస్తాయని ఫ్రాంక్ హూగర్‌బీట్స్ అంచనా వేస్తున్నారు. భారత్‌కు భారీ భూకంప ముప్పు ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు చూసిన జనాలు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read: POCO C55 Launch Date: పోకో నుంచి చీప్ స్మార్ట్‌ఫోన్.. 10 వేల కన్నా తక్కువ ధరలో 50 ఎంపీ కెమెరా ఫోన్!
Also Read: Bear Man Viral Video: చెట్టెక్కి మరీ.. ఎలుగుబంటి దాడి నుంచి తప్పించుకున్న వ్యక్తి! జస్ట్ మిస్ పో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.