Mahindra XUV700: మహీంద్రా ఎక్స్‌యూవీ 700. మహీంద్రా కంపెనీకే కాకుండా ఇతర ఎస్‌యూవీ విభాగంలోనే పాపులర్ వాహనమిది. మార్కెట్‌లో లాంచ్ కాగానే పెద్దఎత్తున విక్రయాలు నమోదు చేసింది. అలాంటి ఎక్స్‌యూవీ 700 ఇప్పుడు మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవల్సి వస్తోంది. ఏకంగా లక్ష యూనిట్లను కంపెనీ రీకాల్ చేస్తోంది. అంతగా పాపులర్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 700ను ఎందుకు రీకాల్ చేయాల్సి వస్తుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహీంద్రా కంపెనీ పాపులర్ ఎస్‌యూవీ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మోడల్ కార్లను మార్కెట్ నుంచి రీకాల్ చేస్తోంది. ఏకంగా లక్ష యూనిట్ల కార్లను వెనక్కి రప్పించే నిర్ణయం తీసుకుంది. ఇంజన్ వైరింగ్ ఏర్పడిన సమస్య కారణంగా తనిఖీ చేసేందుకు కార్లను రీకాల్ చేసింది మహీంద్రా కంపెనీ. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 స్పోర్ట్ యుటిలిటీ కారులో ఇంజన్‌లో వైరింగ్ సంబంధిత సమస్య ఏర్పడటంతో దాదాపు 1 లక్ష కార్లను వెనక్కి రప్పిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.


మహీంద్రా కంపెనీ ఈ మేరకు షేర్ మార్కెట్‌కు సమాచారమిచ్చింది. జూన్ 8వ తేదీ 2021 నుంచి జూన్ 28వ తేదీ 2023 మద్యకాలంలో ఉత్పత్తి అయిన 1,08 306 మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్ల ఇంజన్‌లో వైరింగ్ పరిశీలించేందుకు  రీకాల్ నిర్ణయం తీసుకుంది. వైరింగ్‌లో రాపిడి ఏర్పడే అవకాశమున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. అదే సమయంలో మహీంద్రా ఎక్స్ యూవీ 400 మోడల్‌లో సైతం 3,560 కార్లను పరిశీలించనుంది కంపెనీ. ఫిబ్రవరి 16వ తేదీ 2023 నుంచి జూన్ 5వ తేదీ 2023 మధ్యలో విడుదలైన 3,560 ఎక్స్‌యూవీ 400 కార్లను సైతం రీకాల్ చేసింది కంపెనీ. కస్టమర్లకు ఇదంతా కంపెనీ ఉచితంగా చేసిపెట్టనుంది.


మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ధర 14.01 లక్షల నుంచి 26.18 లక్షల వరకూ ఉంది. ఇది ఎంఎక్స్, ఏఎక్స్3, ఏఎక్స్ 5, ఏఎక్స్ 7 వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో 5 సీటర్, 7 సీటర్ రెండూ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ 200 పీఎస్ పవర్, 380 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగి ఉంటే..డీజిల్ ఇంజన్ 185 పీఎస్ పవర్ 450 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 


ఈ రెండు ఇంజన్లతో పాుట 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 700లో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంది. ఫీచర్ల గురించి పరిశీలిస్తే..ఇందులో 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయర్ జోన్ క్లైమెట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కేమేరా ఫీచర్లు ఉన్నాయి. ఇందులో లెవెల్ 1 ఏడీఏఎస్ ఉంది.


Also read: IT Returns: ఐటీ రిటర్న్స్ మిస్ అయ్యారా..డిసెంబర్ 31 వరకూ గడువు మిగిలుంది, ఫైన్ ఎంతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook