Mahindra university: అనంద్​ మహీంద్రా బీజీ పారిశ్రామికవేత్త అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్​గా ఉంటారు. ఎప్పటికప్పుడు తాజా విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ప్రపంచాన్ని కుదిపేసే ఘటనలు మొదలుకుని.. చిన్న చిన్న విషయాలపై కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్న విషయం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ముఖ్యంగా ఇండియా విద్యార్థులు ఉక్రెయిన్​లో చిక్కుకుని ఇబ్బందులు పడతున్న విషయంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఇద్దరు విద్యార్థులు అక్కడ మృతి చెందడం ఆందోళనలు మరింత పెంచింది.


వేలాది మంది భారతీయులు ఉక్రెయిన్​లో చిక్కుకోగా.. అందులో ఎక్కువ మంది విద్యార్థులేనని తేలింది. వేలాది మంది విద్యార్థులు మెడికల్ విద్య కోసం ఉక్రెయిన్ వెళ్తుండటం గమనన్నట్లు నివేదకలు స్పష్టం చేస్తున్నాయి. 18 వేల మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్​ కోసం ఉక్రెయిన్ వెళ్లినట్లు ప్రభుత్వ గణాంకాల్లో తేలింది.


ఈ విషయంపై ఆనంద్ మహీంద్రా తాజాగా స్పందించారు. 'ఇండియాలో మెడికల్​ కాలేజీల కొరత ఉందని నాకు తెలీదు. మహీంద్రా యూనివర్సిటీలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే అవకాశం ఉందేమో పరిశీలిద్దామా?' అని టెక్​ మహీంద్రా సీఈఓ చందర్ ప్రకాశ్​ గుర్నానీ (సీపీ గుర్​నానీ)ని ట్యాగ్ చేశారు.



ఈ ట్వీట్​పై నెటిజన్లు అనంద్​ మహీంద్రాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కొందరేమో దేశంలో మెడికల్ కాలేజీల కొరత లేదని చెబుతున్నారు. మరికొందరేమో ఇండియాతో పోలిస్తే ఆయా దేశాల్లో తక్కువ ఖర్చతో మెడికల్ విద్య పూర్తవుతున్న కారణంగా విదేశాలకు వెళ్లేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.


Also read: Flipkart Mini Fridge: ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్.. రూ.3,000 ధరకే రిఫ్రిజిరేటర్ కొనేయండి!


Also read: OPPO Reno6 5G: ఒప్పొ రెనో6 ఫోన్​పై రూ.22,210 వరకు డిస్కౌంట్​- పూర్తి వివరాలివే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook