Maruti Suzuki Alto Tour H1: మారుతి సుజుకి నుంచి మరో చీప్ అండ్ బెస్ట్ కారు
Alto Tour H1 Price and Features Details: మైలేజ్ పరంగానూ వాహనదారులకు లబ్ధి చేకూరేలా మారుతి సుజుకి కంపెనీ ఈ ఆల్టో టూర్ H1 కారును లాంచ్ చేసింది. ఆల్టో టూర్ H1 పెట్రోల్, S-CNG వేరియంట్.. ఇలా ఒకేసారి రెండు రకాల వేరియంట్స్‌లో లాంచ్ అవడం మరో విశేషం. Alto Tour H1 Price and Features Details:
Alto Tour H1 Price and Features Details: మారుతి సుజుకి నుంచి హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్ లో ఎక్కువగా సేల్ అయినటువంటి ఆల్టో K10 ఆధారితంగా రూపొందిన లైట్ కమెర్షియల్ వెహికిల్ టూర్ H1 ఇండియాలో లాంచ్ అయింది. మారుతి సుజుకి అధికారివ వెబ్‌సైట్లో అందించిన వివరాల ప్రకారం ఢిల్లీ ఎక్స్-షోరూమ్ లో ధరల డీటేల్స్ ఇలా ఉన్నాయి. మారుతి సుజుకి కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన ఈ ఆల్టో టూర్ H1 బేసిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 4.80 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 5.70 లక్షల వరకు ఉంది.
పెట్రోల్ వెర్షన్ మైలేజ్, సీఎన్జీ వెర్షన్ మైలేజ్ ఎంతంటే ..
సాధారణంగానే టాక్సీ వాహనాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేసిన కారు కావడంతో మైలేజ్ పరంగానూ వాహనదారులకు లబ్ధి చేకూరేలా మారుతి సుజుకి కంపెనీ ఈ ఆల్టో టూర్ H1 కారును లాంచ్ చేసింది. ఆల్టో టూర్ H1 పెట్రోల్, S-CNG వేరియంట్.. ఇలా ఒకేసారి రెండు రకాల వేరియంట్స్‌లో లాంచ్ అవడం మరో విశేషం. పెట్రోల్‌తో రన్ అయ్యే ఆల్టో టూర్ H1 కారు లీటరుకు 22.05 కిమీ మైలేజీని అందిస్తుండగా.. S- CNG వేరియంట్ 34.46 km/K మైలేజీని అందిస్తుండటం మరో గొప్ప విషయం. మొదటిగా పెట్రోల్ వెర్షన్ తీసుకొచ్చి, ఆ తరువాత సీఎన్జీ వెర్షన్ తీసుకొస్తున్నప్పటికీ.. ఆల్టో టూర్ H1 కారు విషయంలో మాత్రం మారుతి సుజుకి లాంచింగ్ సమయంలోనే సీఎన్జీ వెర్షన్ కి లాంచ్ చేసి మరో ముందడుగు వేసింది.
ఇంజన్, గేర్‌బాక్స్ వివరాలు ..
ఆల్టో టూర్ H1 కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, డ్యూయల్ వివిటి పెట్రోల్ ఇంజన్ ఫార్మాట్స్ లో లాంచ్ అయింది. రెండు ఇంజన్లు కూడా 5 గేర్ సిస్టం సహాయంతో రన్ అవుతాయి. పెట్రోల్ ఇంజన్ 66 బిహెచ్‌పి పవర్, 89 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా... అలాగే CNG ఇంజన్ 56 bhp పవర్ ని, 82 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని మారుతి సుజుకి కంపెనీ ప్రకటించింది.
సేఫ్టీ ఫీచర్స్ ఏం ఉన్నాయంటే ..
ఆల్టో టూర్ H1లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ప్రీ-టెన్షనర్, ఫోర్స్ లిమిటర్‌తో ఫ్రంట్ సీట్ బెల్ట్స్, సీట్‌బెల్ట్ రిమైండర్ అలారం, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం, స్పీడ్ లిమిటర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ లభించాయి.
ఏయే కలర్ వేరియంట్స్ ఉన్నాయంటే ..
మారుతి సుజుకి కంపెనీ కొత్త ఆల్టో టూర్ H1 కారును మూడు కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ చేసింది. అందులో ఒకటి మెటాలిక్ సిల్కీ సిల్వర్ కాగా రెండోది మెటాలిక్ గ్రానైట్ గ్రే కలర్. ఇక మూడోది ఆర్కిటిక్ వైట్ కలర్‌లో లాంచ్ అయింది. ఎక్కువ ఆర్థిక భారం పడకుండా తక్కువ ధరలో కారును కొనుక్కుని బతుకు బండి లాక్కోద్దాం అనుకునే టాక్సీ డ్రైవర్లకు, సొంత వాహనం కొనుగోలు చేసి అద్దె బాధలు తప్పించుకుందాం అనుకునే టాక్సీ డ్రైవర్లకు ఇదొక మంచి ఆప్షన్ కానుంది.