Best Selling Maruti Cars: దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న టాప్ 10 కార్లలో 7 మారుతి కంపెనీవే
Best Selling Maruti Cars: దేశంలోని కారు మార్కెట్లో మారుతి సుజుకి స్థానం ప్రత్యేకం. దేశ ప్రజల నమ్మకాన్ని చూరగొన్న బ్రాండ్. అందుకే ఏ మోడల్ లాంచ్ చేసినా వెంటనే హిట్ అవుతుంటుంది. ఈసారి కూడా మారుతి కార్లే అత్యధికంగా విక్రయమయ్యాయి. ఆ వివరాలు మీ కోసం.
Best Selling Maruti Cars: మారుతి సుజుకి కార్లు ఎప్పటిలానే ఈసారి కూడా అత్యధికంగా విక్రయమౌతున్న కార్లలో నిలిచాయి. మే 2024లో అత్యధికంగా విక్రయమైనా టాప్ 10 కార్లలో 7 కార్లు మారుతి సుజుకి కంపెనీవే కావడం విశేషం. దేశంలో మారుతి కార్లకు ఎంత క్రేజ్ ఉందో ఈ గణాంకాలు చూస్తే అర్ధమౌతుంది.
దేశంలో ఏ నెలలో ఏ కారు ఎన్ని యూనిట్ల అమ్మకాలు జరిపిందనే రిపోర్ట్ ప్రతి నెలా వస్తుంటుంది. ఈసారి కూడా మారుతి సుజుకి కంపెనీ కార్లు అత్యధికంగా విక్రయమయ్యాయి. టాప్ 10 అమ్మకాల్లో 7 కార్లు మారుతివే కావడం గమనార్హం. టాటా మోటార్స్, హ్యుండయ్, మహీంద్రీ వంటి కంపెనీల కార్లు ఈ జాబితాలో ఒక్కొక్కటే ఉన్నాయి. మే నెలలో అత్యధికంగా విక్రయమైన కార్లలో టాప్ 3 కార్లు ఏవో తెలుసుకుందాం.
మారుతి సుజుకి వేగన్ ఆర్. దేశంలో మే నెలలో అత్యధికంగా విక్రయమైన టాప్ 3 కార్లలో మారుతి సుజుకి వేగన్ ఆర్ మూడవ స్థానంలో నిలిచింది. మే నెలలో 14,492 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే నెలలో 16,258 యూనిట్లు అమ్ముడైంది. అంటే ఏడాది వ్యవధిలో 11 శాతం తగ్గుదల నమోదైంది. మారుతి వేగన్ ఆర్ 66 బీహెచ్‌పితో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, 89 బీహెచ్‌పితో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో కూడా సీఎన్జీ వేరియంట్ ఉంది. అంతేకాకుండా 5 స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
మారుతి సుజుకి డిజైర్. మారుతి కంపెనీ టాప్ విక్రయాల్లో ఇదొకటి. మంచి డిమాండ్ కలిగిన మోడల్ ఇది. మే నెల విక్రయాల్లో మారుతి సుజుకి డిజైర్ 16,061 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో ఉంది. గత ఏడాది ఇదే నెలలో 11,315 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంటే ఏకంగా 42 శాతం పెరిగింది. మారుతి సుజుకి డిజైర్ 1.2 లీటచర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది. ఈ కారు 89 బీహెచ్‌పి పవర్ జనరేట్ చేస్తుంది. సీఎన్జీ ఆప్షన్ అయితే 76 బీహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.
మారుతి సుజుకి స్విఫ్ట్. ఇదొక శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ కారు. మే 2024లో అత్యదికంగా విక్రయమైంది. మే నెలలో 19,393 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాది 17, 346 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. 12 శాతం వృద్ధి నమోదైంది. ఇందులో 1.2 లీటర్ 3 సిలెండర్ ఇంజన్‌తో ఉంది.
Also read: AP New Cabinet 2024: ఎట్టకేలకు మంత్రిగా పయ్యావుల కేశవ్, ఓడితేనే కాదు గెలిచినా ప్రభుత్వం వస్తుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook