Maruti Grand Vitara: భారత మార్కెట్లో క్రేజీ కారు.. కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్న లక్షలాది మంది!
Maruti Suzuki Grand Vitara Waiting Period Cross 9 Months. మిడ్-సైజ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారాకి ఇప్పటివరకు 1.20 లక్షల బుకింగ్‌లు వచ్చాయి.
Maruti Suzuki Grand Vitara Bookings: భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' గత సంవత్సరం సెప్టెంబర్‌లో తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'గ్రాండ్ విటారా'ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కారు కోసం జూలై 2022లో బుకింగ్‌లు ప్రారంభించబడ్డాయి. ఈ మిడ్-సైజ్ హైబ్రిడ్ ఎస్‌యూవీకి ఇప్పటివరకు 1.20 లక్షల బుకింగ్‌లు వచ్చాయి. జనవరి 2023 వరకు ఎస్‌యూవీ గ్రాండ్ విటారా యొక్క 32,000 యూనిట్లను మారుతి కంపెనీ డెలివరీ చేసింది.
మారుతి సుజుకి కంపెనీ సెప్టెంబర్ 2022లో 4769 యూనిట్లు, అక్టోబర్ 2022లో 8052 యూనిట్లు, నవంబర్ 2022లో 4433 యూనిట్లు, డిసెంబర్ 2022లో 6171 యూనిట్ల గ్రాండ్ విటారాలను అమ్మింది. 2023 జనవరిలో 8662 యూనిట్లను విక్రయించింది. ప్రస్తుతం గ్రాండ్ విటారాకు భారీగా బుకింగ్‌లు ఉన్నాయి. దాంతో ఈ కారును కొనుగోలుచేసేందుకు చాలా కాలం వేచిచూడాల్సి వస్తోంది. గ్రాండ్ విటారాకు ఇప్పటివరకు (2023 ఫిబ్రవరి 22 వరకు) 1,22,437 బుకింగ్‌లు వచ్చాయని, జనవరి వరకు మొత్తం 32,087 యూనిట్లు డెలివరీ అయ్యాయని మారుతి సుజుకి ఓ ప్రకటనలో తెలియజేసింది.
ప్రస్తుతం 90,350 యూనిట్ల గ్రాండ్ విటారా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని మారుతి సుజుకి కంపెనీ తెలిపింది. ఈ కారు కోసం వెయిటింగ్ పీరియడ్ రెండు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు ఉంటుంది. ఈ టైమ్ పీరియడ్ కారు ఎంచుకున్న వేరియంట్ మరియు డీలర్‌షిప్ స్థానాన్ని బట్టి ఉంటుంది. మారుతి గ్రాండ్ విటారా ధర రూ. 10.45 లక్షల నుంచి రూ. 19.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇందులో బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ మరియు తేలికపాటి హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కాకుండా.. సీఎన్జీ కిట్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా 5 సీట్ల కారు. దీని 1.5-లీటర్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ సెటప్ 103PS పవర్, 1.5-లీటర్ పెట్రోల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ సెటప్ 116PS పవర్ మరియు 1.5-లీటర్ పెట్రోల్-CNG సెటప్ 87.83 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్ట్రాంగ్-హైబ్రిడ్‌లో సీఎన్జీపై 26.6 kmpl మరియు పెట్రోల్‌పై 27.97 kmpl వరకు మైలేజీని అందించగలదు.
Also Read: Surya Grahan 2023: 2023లో మొదటి సూర్య గ్రహణం.. భారతదేశంపై ప్రభావం చూపుతుందా? పూర్తి వివరాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.