Maruti Suzuki Cars August Sales Report : గడిచిన ఆగస్టు నెలలో ఎన్ని కార్లు అమ్ముడుపోయాయి అనే వివరాలను మారుతీ సుజుకి ఇండియా శుక్రవారం ప్రకటించింది. నెలవారీ హోల్‌సేల్‌ డేటాను పరిశీలిస్తే.. ఈ ఆగస్టు నెలలో తొలిసారిగా అత్యధిక సంఖ్యలో 1,89,082 కార్లు విక్రయించినట్టు మారుతీ సుజుకి ఇండియా స్పష్టంచేసింది. క్రితం ఏడాది ఆగస్ట్‌ నెలలో 1,65,173 కార్లు విక్రయించగా.. ఈ ఏడాది అమ్మకాలలో 14 శాతం ఎక్కువ సేల్స్ జరిగినట్టు మారుతీ సుజుకి సేల్స్ రిజిస్టర్ చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది ఇదే నెలలో డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 1,34,166 యూనిట్లుగా ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 1,56,114 యూనిట్లకు పెరిగింది. ఇందులో 16 శాతం వృద్ధి నమోదైంది అని మారుతి సుజుకి ఇండియా వెల్లడించింది.


ఒకవైపు మారుతి సుజుకి కార్ల అమ్మకాల్లో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ.. ఆల్టో కార్లు, అలాగే ఎస్-ప్రెస్సో కార్లు ఉన్న మినీ సెగ్మెంట్ కార్ల విక్రయాలు తగ్గాయి. ఎందుకంటే గతేడాది ఆగస్టు నెలలో 22,162 యూనిట్ల మిని సెగ్మెంట్ కార్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది 12,209 యూనిట్ల కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. మిని సెగ్మెంట్ కార్ల అమ్మకాలలో గతేడాదికి, ఈ ఏడాదికి మధ్య 9953 యూనిట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. 


మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి సెలెరియో, మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి ఇగ్నైస్, మారుతి సుజుకి స్విఫ్ట్‌లతో సహా మారుతి సుజుకి కాంపాక్ట్ కార్ల విక్రయాలు 71,557 యూనిట్ల నుండి 72,451 యూనిట్లకు పెరిగాయి. 


ఇది కూడా చదవండి :  2023 Royal Enfield Bullet 350 Prices And Specs: ఇండియాలో లాంచ్ అయిన మరో సరికొత్త బుల్లెట్ బైక్


మారుతి సుజుకి బ్రెజ్జా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, మారుతి సుజుకి జిమ్నీ, మారుతి సుజుకి ఎర్టిగా , మారుతి సుజుకి XL6 కార్ల శ్రేణితో కూడిన యుటిలిటీ వాహనాలు గత ఏడాది ఆగస్టు నెలలో 26,932 కార్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది ఆగస్టు నెలలో రెట్టింపు కంటే అధికంగా 58,746 కార్లు సేల్ అయ్యాయి. గతేడాది ఇదే ఆగస్టు నెలలో 21,481 యూనిట్ల మారుతి సుజుకి కార్ల ఎగుమతులు జరగ్గా.. ఈ ఏడాది ఆగస్టు నెలలో కార్ల ఎగుమతుల సంఖ్య 24,614 యూనిట్లకు పెరిగింది అని మారుతి సుజుకి ఇండియా స్పష్టంచేసింది.


ఇది కూడా చదవండి : Huge Fines For Cancelling Rides: ఓలా, ఉబర్ కస్టమర్స్‌కి మంచి రోజులొస్తున్నాయా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి