Huge Fines For Cancelling Rides: న్యూఢిల్లీ: మొబైల్ యాప్ ఆధారంగా ఆన్ డిమాండ్ ట్యాక్సీ సేవలు అందించే ఉబర్, ఓలా క్యాబ్స్ బుక్ చేసుకునే వారిలో చాలామందికి ఎదురయ్యే సమస్యల్లో క్యాబ్ డ్రైవర్ వారి రైడ్ క్యాన్సిల్ చేయడం ఒకటి అనే విషయం తెలిసిందే. తరుచుగా క్యాబ్స్ వినియోగించే వాళ్లకు ఎవరికైనా ఏదో ఓ దశలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే ఉండి ఉంటారు. కస్టమర్స్ నుండి ఇలాంటి ఫిర్యాదుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. కస్టమర్ రిక్వెస్టుని అంగీకరించి ఆ తరువాత రైడ్ క్యాన్సిల్ చేసే క్యాబ్ డ్రైవర్లకు జరిమానా విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు చేసింది. అంతేకాకుండా డ్రైవర్ రైడ్‌ను రద్దు చేసిన ప్రతిసారీ బాధిత ప్రయాణీకుడికి రూ. 50 నుండి 75 వరకు రాయితీని అందించాలని స్పష్టంచేసింది.
ఓలా, ఉబర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్లపై కస్టమర్ల ఫిర్యాదులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ అంశంలో సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ బ్యూరోక్రాట్ సుధీర్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వం వహిస్తున్న ఈ కమిటీలో ఆరుగురు సభ్యులని ప్రభుత్వం నియమించింది. రైడ్ క్యాన్సిలేషన్స్, క్యాబ్ డ్రైవర్స్ కస్టమర్స్ వద్దకు ఆలస్యంగా వస్తుండటంపై కస్టమర్స్ నుండి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఈ కమిటీనే ఒక నిర్ణయానికి వచ్చింది. అనంతరం తమ పరిశీలనలో తమ దృష్టికి వచ్చిన అంశాలతో పాటు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేసింది. డ్రైవర్స్ కస్టమర్‌ని సంప్రదించకుండానే లేదా కస్టమర్స్ అనుమతి లేకుండానేరైడ్స్ రద్దు చేయడం లేదా ఇంకొన్నిసార్లు ఎక్కువ సమయం వేచి ఉండేలా చేయడం వంటి సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు అందినట్టు కమిటీ పేర్కొంది.
కమిటీ చేసిన పలు సిఫార్సులు ఇలా ఉన్నాయి ..
ప్యాసింజర్ నుండి అనుమతి లేదా నిర్ధారణ లేకుండానే క్యాబ్ డ్రైవర్ రైడ్‌ను క్యాన్సిల్ చేసినట్టయితే.. అలా రద్దు చేసిన ప్రతిసారీ టాక్సీ అగ్రిగేటర్‌లకు జరిమానా విధించాలని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న అగ్రిగేటర్స్ పాలసీ ప్రకారం.. డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చేసినప్పటికీ కస్టమర్‌కు జరిమానా పడుతోంది. దీనికి వ్యతిరేకంగా కమిటీ తమ నిర్ణయాన్ని ప్రభుత్వం ముందు ఉంచింది.
ప్రయాణీకులు సూచించిన పిక్-అప్ స్పాట్‌కు చేరుకోవడానికి డ్రైవర్‌కు గరిష్టంగా 20 నిమిషాల వరకు సమయం అనుమతించడం జరుగుతుంది అని.. అంతకు మించి డ్రైవర్ ఎంత ఆలస్యం చేస్తే.. ఆలస్యం చేసిన ఆ సమయం ఆధారంగా జరిమానా విధించాల్సిన అవసరం ఉంది అని కమిటీ సిఫార్సు చేసింది.
ఇది కూడా చదవండి :Mistakes To Avoid in Personal Loans: పర్సనల్ లోన్స్ కోసం అప్లై చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలే చేయొద్దు
క్యాబ్ డ్రైవర్ ఉపయోగిస్తున్న వాహనం రోడ్డుపై వెళ్లేందుకు అన్‌ఫిట్ కండిషన్‌లో ఉన్నట్టయితే.. ఆ క్యాబ్‌ను డీలిస్ట్ చేయడానికి ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు (RTO) అధికారం ఇవ్వాలని కమిటీ ప్రభుత్వానికి స్పష్టంచేసినట్టుగా హిందూస్తాన్ టైమ్స్ కథనం పేర్కొంది. అన్నింటికి మించి క్యాబ్ డ్రైవర్ రైడ్‌ను క్యాన్సిల్ చేసిన ప్రతిసారీ బాధిత ప్రయాణీకులకు సదకు క్యాబ్ అగ్రిగేటర్ రూ. 50 నుండి రూ. 75 వరకు రిబేట్ ఇవ్వాలని కమిటీ తేల్చిచెప్పింది.
ఇది కూడా చదవండి : Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్‌లో లాంచ్ అవుతున్న కొత్త కార్లు, వాటి ఫీచర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి