Maruti Suzuki eVX: మారుతి సుజుకి అంటే దేశంలోనే కాదు విదేశాల్లో కూడా సుపరిచితమైన బ్రాండ్. మారుతి నుంచి వచ్చిన ప్రతి వెర్షన్ టాప్ 10 అమ్మకాల్లో ఉంటుందంటే ఆ బ్రాండ్ విలువ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇంకా ఎంట్రీ ఇవ్వని మారుతి సుజుకి అందర్నీ మైమరపించే ఈవీ లాంచ్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఇప్పటికే వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేశాయి. ప్రస్తుతం ఈవీ కార్ల క్రేజ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో మారుతి సుజుకి సైతం తన తొలి ఎలక్ట్రిక్ కారును త్వరలో మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. జపాన్ మొబిలిటీ షో 2023లో మారుతి సుజుకి తన అప్‌డేటెడ్ eVX ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కాన్సప్ట్‌ను ఆవిష్కరించింది. కంపెనీ న్యూ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, eVX స్మాల్ ఈవీలను కూడా ప్రదర్శించింది. ఇండియాలో ప్రస్తుతం కొత్త స్విఫ్ట్ , మారుతి eVX ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం మారుతి ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో స్విఫ్ట్‌ను 2024లో eVXను 2025లో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర 25 లక్షల రూపాయలుండవచ్చని అంచనా.


ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి పెద్దగా వివరాలైతే ఇంకా లీక్ కాలేదు. కానీ ఫైనల్ వెర్షన్ 60 కిలోవాట్స్  బ్యాటరీ ప్యాక్ ఉంటుందని అంచనా. దీంతోపాటు ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుందని అంచనా. కొత్త మారుతి eVX సింగిల్ ఫుల్ రీఛార్జ్‌పై 500 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయవచ్చు. ఆల్ వీల్ డ్రైవ్ కావడం మరో ప్రత్యేకత. మారుతి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పొడుగు 4300 మిల్లీమీటర్లు కాగా వెడల్పు 1800 మిల్లీమీటర్లుంటుంది. ఇక ఎత్తు అయితే 1600 మిల్లీమీటర్లు ఉంటుంది.ఇక వీల్ బేస్ 2700 మిల్లీమీటర్లు ఉంటుంది. అంటే హ్యుండయ్ క్రెటా పరిమాణంలో ఉంటుంది.


మారుతి సుజుకి eVXను 27 పీఎల్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. ఇది టొయోటో 40 పీఎల్ గ్లోబల్ ఆర్కిటెక్చర్‌తో అనుసంధానితమైంది. ఈ కారు బయటి డిజైన్‌లో కొత్త ట్రై ఏరో ఎల్ ఈడీ డీఆర్ఎల్, స్లీక్ హెడ్ ల్యాంప్స్, అప్ డేటెడ్ ఓఆర్వీఎమ్, స్పోర్టీ బంపర్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో ప్రోమినెంట్ వీల్ ఆర్చ్, అల్లాయ్ వీల్స్ , ఫ్లష్ టైప్ డోర్ హేండిల్ ఉన్నాయి. ఇక రేర్‌లో 3 పీస్ లైటింగ్ ప్యాటర్న్, ఎల్ఈడీ టేల్ ల్యాంప్స్ ఉంటాయి.


కేబిన్ లోపల డ్యాష్ బోర్డ్‌పై ఫిజికల్ బటన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ కారు స్టాండ్ అవుట్ ఫీచర్ డ్యూయల్ స్క్రీన్ సెటప్‌తో ఉంటుంది. ఇందులో స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ ఉండవచ్చు. రెండవది క్లస్టర్ రూపంలో పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో యూక్ వంటి ట్రూ స్పోక్ స్టీరింగ్ వీల్, వెర్టికల్ పొజిషన్ ఏసీ వెంట్స్, సెంటర్ కన్సోల్ ఉంటాయి.


Also read: Auto Loan Tips: కొత్త కారును కొంటున్నారా..? ఈ విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook