Auto Loan Tips: కొత్త కారును కొంటున్నారా..? ఈ విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోండి..!

Auto Loan EMI Calculator: కొత్తగా కారును కొనుగోలు చేయాలనుకునేవారు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ముందు ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోని లోన్‌కు దరఖాస్తు చేయడం ఉత్తమం. అదేవిధంగా ఎక్కడ తక్కువ వడ్డీకి లోన్ దొరుకుతుందో చూసుకోవాలి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2023, 10:05 PM IST
Auto Loan Tips: కొత్త కారును కొంటున్నారా..? ఈ విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోండి..!

Auto Loan EMI Calculator: సొంతంగా ఓ కొత్త కారును కొనుగోలు చేయాలనేది చాలామందికి ఓ కల. ఎక్కువమంది కొంత డౌన్‌మెంట్ చెల్లించి.. మిగతాది లోన్‌ కోసం ఆశ్రయిస్తారు. వెహికల్ లోన్ తీసుకునేముందు చాలా విషయాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ముందు మన ఆర్థిక పరిస్థితిని లెక్కవేసుకుని వేసి లోన్‌కు వెళ్లాలి. కారు కొనేముందు బడ్జెట్‌ను అంచనా వేసుకోవాలి. లోన్ నిబంధనలు కూడా పూర్తిగా చదువుకోవాలి. మీరు కారు కోసం ఎంత ఖర్చు చేయవచ్చో నిర్ధారించుకోండి. మీ నెలవారీ ఆదాయం.. ప్రస్తుత ఖర్చులు, మీ వద్ద ఉన్న సేవింగ్స్‌ను పరిగణనలోకి తీసుకోండి. వెహికల్ లోన్‌ను పరిగణనలోకి తీసుకునే ముందు మీ ఆర్థిక ఆరోగ్యం గురించి స్పష్టమైన ఆలోచనతో ముందడుగు వేయండి.

వెహికల్ లోన్‌లో వడ్డీ రేటు చెక్ చేసుకోవడం ముఖ్యం. ముందుగా క్రెడిట్ స్కోరు సరిచూసుకుని లోన్‌కు వెళ్లాలి. సిబిల్ స్కోరు ఎక్కువ ఉంటే.. తక్కువ ఇంట్రెస్ట్‌ రేటుకే లోన్లు లభిస్తాయి. అదే తక్కువ సిబిల్ స్కోరు ఉంటే.. మీరు అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు నుంచే ప్లాన్‌తో ఇతర లోన్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు, ఇతర యాప్‌ బిల్లులు సకాలంలో చెల్లించండి. అదేవిధంగా సాధ్యమైనంత వరకు ప్రస్తుతం ఉన్న బకాయిలను త్వరగా చెల్లించేలా చూసుకోండి.
  
వెహికల్ లోన్లు మొత్తం వడ్డీ రేటు, కాలవ్యవధితో సహా వివిధ నిబంధనలతో ఉంటాయి. ఈ నిబంధనలను మీరు పూర్తిగా చదివిన తరువాతే సంతకం చేయండి. ఏదో లోన్ వస్తుంది కాదా.. అని ఏం తెలుసుకోకుండా సంతకాలు చేస్తే తరువాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. లోన్ మొత్తం మీ బడ్జెట్‌ను ఎక్కువగా ఖర్చు చేయకుండా కారు ధర ఉండేలా చూసుకోండి. మీరు నెలకు ఎంత ఈఎంఐ చెల్లించగలరో అంచనా వేసుకుని.. నెలవారీ చెల్లింపులను ఫిక్స్ చేసుకోండి. అయితే మొత్తం మీద వడ్డీ ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం మార్కెట్‌లో లోన్లు అందించేందుకు చాలా సంస్థలు ఉన్నాయి. వాటిలో మీకు ఎక్కడ తక్కువ ఇంట్రెస్ట్‌కు లోన్ దొరుకుతుందో చెక్ చేసుకోండి. బ్యాంకులు, క్రెడిట్ యూనియన్‌లు, ఆన్‌లైన్ లోన్‌ సంస్థల నుంచి కోట్ తెచ్చుకుని సరిచూసుకోండి. అన్ని చెక్ చేసుకున్న తరువాతే లోన్‌కు అప్లై చేసుకోండి.

Also Read: Sunitha Laxma Reddy: ఉత్కంఠకు తెర.. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి   

 Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News