PSU STOCK: ఈ కేంద్ర ప్రభుత్వం సంస్థలో రూ. 15000 ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ. 5,00,000 మీ సొంతం అయ్యేవి ఎలాగంటే..?
Mazagon Dock : స్టాక్ మార్కెట్లో మీరు ఒక రూపాయి పెట్టుబడి పెడితే 3 వేల రూపాయలు వచ్చాయి అంటే అది లాటరీ కన్నా ఎక్కువ అని చెప్పవచ్చు. అలాంటి అద్భుతమైన సాహోసోపేతమైన స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టాక్ కొనుగోలు చేయడం ద్వారా ఇన్వెస్టర్లు ఒక్కో షేర్ పై 3000 శాతం లాభం పొందారు. ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Mazagon Dock Share Price : స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ ఉన్న మార్కెట్ అని ఇందులో డబ్బులు నష్టపోతామని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ సరైన స్టాక్స్ ఎంపిక చేసుకొని స్థిరంగా పెట్టుబడులు పెడితే మాత్రం స్టాక్ మార్కెట్ ఇచ్చినంత రిటర్న్స్ మరి ఇతర ఆస్తులు కూడా ఇవ్వవు అని చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా కొన్ని పబ్లిక్ సెక్టార్ కు సంబంధించినటువంటి స్టాక్స్ మల్టీ బ్యాగర్లుగా మారి ఇన్వెస్టర్ల డబ్బును వేల రెట్లు పెంచాయి. అలాంటి ఓ స్టాకు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన Mazagon Dock Shipbuilders Ltd ఈ సంస్థ దేశంలోనే అత్యంత పురాతనమైన షిప్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా చెప్పవచ్చు. ముంబై కేంద్రంగా ఉన్న ఈ సంస్థకు దాదాపు 250 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈ సంస్థ 2020 సంవత్సరంలో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది.
ఈ సంస్థ 2020 సంవత్సరంలో ఐపిఓ ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే అప్పట్లో గరిష్టంగా 145 రూపాయలు గా నిర్ణయించారు. ఈ స్టాక్ లిస్టింగ్ విషయానికి వస్తే 160 రూపాయల వద్ద ఈ స్టాక్ లిస్ట్ అయింది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర 4915 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. గత నెలలో జూలై 5వ తేదీన ఈ స్టాక్ 5860 రూపాయల వద్ద ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది.
అక్కడి నుంచి కొద్దిగా ఈ స్టాక్ కరెక్షన్ అవుతూ వస్తోంది. ప్రస్తుతం ఇష్టం 5000 రూపాయల సమీపంలో ట్రేడ్ అవుతోంది. ఇక ఈ స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 3 వేల శాతం లాభాన్ని అందించింది. గడిచిన సంవత్సర కాలంలోనే ఈ స్టాక్ 173 శాతం లాభాన్ని ఇవ్వగా గత ఆరు నెలల్లో ఈ స్టాక్ ధర 125% పెరిగింది.
మజగావ్ డాక్‌యార్డ్ చరిత్ర:
Mazagon Dock Shipbuilders Ltd (MDL) ఇటీవలే 250 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనె స్మారక నాణేన్ని విడుదల చేశారు. MDL 1984 నుండి జలాంతర్గాములను నిర్మిస్తోంది. RHPని దాఖలు చేసిన తేదీ నాటికి, కంపెనీ వద్ద బలమైన ఆర్డర్ బుక్ విలువ రూ. 54000 కోట్లుగా ఉంది. ఇది వచ్చే ఆరు నుంచి ఏడేళ్ల పాటు అమలు కానుంది. గత 15 సంవత్సరాలుగా కంపెనీ నిరంతర డివిడెండ్ ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. 1960 నుండి, కంపెనీ అధునాతన డిస్ట్రాయర్ల నుండి క్షిపణి బోర్డింగ్ సాధనాలు, మూడు జలాంతర్గాములు, 25 యుద్ధనౌకలతో సహా మొత్తం 795 నౌకలను నిర్మించింది.
కంపెనీ కార్గో షిప్‌లు, ప్యాసింజర్ షిప్‌లు, సరుకుల సరఫరా నౌకలు, బహుళార్ధసాధక సహాయక నౌకలు, వాటర్ ట్యాంకర్లు, టగ్‌లు, డ్రెడ్జర్‌లు, ఫిషింగ్ ట్రాలర్‌లు, బార్జ్‌లు బోర్డర్ అవుట్‌పోస్టులను భారతదేశంతో పాటు విదేశాల్లోని వివిధ కస్టమర్లకు కోసం పంపిణీ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి