ZEEL-Sony merger deal: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) EGM కి సంబంధించి NCLT ఆదేశాలు జారీ చేసిందని వివిధ మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు.  ZEEL EGM కి సంబంధించి NCLT అటువంటి ఉత్తర్వులను జారీ చేయలేదు. దీనికి సంబంధించి ZEEL అధికారిక ప్రకటన విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEEL ప్రతినిధి మాట్లాడుతూ... "ఈ అంశానికి సంబంధించి కేటాయించిన చట్టబద్ధమైన సమయం ప్రకారం కంపెనీ బోర్డు సమావేశం కానుంది. NCLT ద్వారా తదుపరి విచారణ 4 అక్టోబర్ 2021 న జరగనుంది. కంపెనీ వాటాదారుల ప్రయోజనాల కోసం మరియు చట్టం ప్రకారం అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతుందని'' స్పష్టం చేశారు. 


Also read: ZEEL-Sony MEGA Merger: జీల్, సోనీ విలీన సంస్థలో వాటాల వివరాలు, వ్యూహ్యాత్మక అంశాలు ఇవే


ఇటీవల ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జీల్) (ZEE Entertainment Enterprises Limited) (ZEEL).. సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా (ఎస్‌పీఎన్‌ఐ) Sony Pictures Networks India (SPNI) మధ్య విలీన ఒప్పందం కుదిరింది. దీనిలో SPNI యొక్క మాతృ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వాటా USD 1.575 బిలియన్లు. ఇది భారతదేశంలో లిస్ట్ డ్ కంపెనీ. దీనికి సంబంధించి రెండు బోర్డులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. కేవలం ఆర్థికపరమైన అంశాలనే కాకుండా, వ్యూహాత్మక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది జీల్ డైరెక్టర్ల బోర్డు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook