ZEEL-Sony MEGA Merger: జీల్, సోనీ విలీన సంస్థలో వాటాల వివరాలు, వ్యూహ్యాత్మక అంశాలు ఇవే

ZEEL, Sony merger announcement latest updates: ఈ రెండు కంపెనీలు లీనియర్‌ నెట్‌వర్క్స్‌, డిజిటల్‌ అసెట్స్‌, ప్రొడక్షన్‌ ఆపరేషన్స్‌, ప్రోగ్రాం లైబ్రరీస్‌ వంటి వ్యవహారాలను పంచుకోనున్నాయి. ఒప్పంద అమలుకు ముందు చేయాల్సిన ప్రక్రియను పూర్తిచేయడానికి 90 రోజుల గడువు పెట్టుకున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2021, 02:48 PM IST
  • లాభాల బాటలో పయనించాలనే లక్ష్యంతోనే విలీనానికి ముందుకొచ్చిన జీల్
  • ఒప్పంద అమలుకు ముందు చేయాల్సిన ప్రక్రియకు 90 రోజుల గడువు
ZEEL-Sony MEGA Merger: జీల్, సోనీ విలీన సంస్థలో వాటాల వివరాలు, వ్యూహ్యాత్మక అంశాలు ఇవే

ZEEL-Sony MEGA Merger: ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జీల్) (ZEE Entertainment Enterprises Limited) (ZEEL).. సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా (ఎస్‌పీఎన్‌ఐ) Sony Pictures Networks India (SPNI) మధ్య విలీన ఒప్పందం కుదిరింది. ఇందుకు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కేవలం ఆర్థికపరమైన అంశాలనే కాకుండా, వ్యూహాత్మక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది జీల్ డైరెక్టర్ల బోర్డు.

దక్షిణాసియాలోప్రముఖ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా దూసుకెళ్లాలని..

ఈ విలీనం షేర్ హోల్డర్స్‌కు (shareholders), స్టేక్ హోల్డర్స్‌కు (stakeholders) అందరికీ ఎంతో ప్రయోజనం చేకూర్చేలా ఉంటుందని బోర్డు నిర్ధారించింది. దక్షిణాసియాలో (South Asia) ప్రముఖ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ (Media & Entertainment Company) కంపెనీగా దూసుకెళ్లడంతో పాటు లాభాల బాటలో పయనించాలనే లక్ష్యంతోనే జీల్ (ZEEL) ఈ విలీనానికి ముందుకొచ్చింది. 

సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మెజారిటీ వాటా

అయితే ఈ విలీనం ద్వారా ఏర్పాడే విలీన సంస్థలో సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా (Sony Pictures Networks India) మాతృ సంస్థ అయిన సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (Sony Pictures Entertainment) మెజారిటీ వాటాను కలిగి ఉంటుంది. ప్రస్తుతం జీ సీఈఓగా ఉన్న పునీత్‌ గోయెంకా విలీన సంస్థకు ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓగా వ్యవహరించనున్నారు. 

47.07 శాతం వాటా

ఇక విలీన సంస్థలో పెట్టే 157.5 కోట్ల డాలర్లు (USD 1.575 billion) పెట్టుబడిలో..జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ( ZEEL) 47.07 శాతం వాటా.. ఎస్‌పీఎన్‌ఐకు (SPNI) 52.93 శాతం వాటా దక్కనుంది.

Also Read : ZEEL-Sony Merge:జీల్- సోనీ విలీనం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశాలు

90 రోజుల గడువు 

ఇకపై ఈ రెండు కంపెనీలు లీనియర్‌ నెట్‌వర్క్స్‌, డిజిటల్‌ అసెట్స్‌(digital assets), ప్రొడక్షన్‌ ఆపరేషన్స్‌, (production operations) ప్రోగ్రాం లైబ్రరీస్‌ వంటి వ్యవహారాలను పంచుకోనున్నాయి. ఒప్పంద అమలుకు ముందు చేయాల్సిన ప్రక్రియను పూర్తిచేయడానికి 90 రోజుల గడువు పెట్టుకున్నాయి.

Also Read : ZEEL, Sony merger deal value: జీ ఎంటర్‌టైన్మెంట్, సోనీ పిక్చర్స్.. ఎవరి బలాలు ఎంత ?

20 శాతానికి పెంచుకోవడానికి అవకాశం 

ఇక ఈ సమయంలో జీల్ (ZEEL) ప్రమోటర్ల కుటుంబం.. 4 శాతంగా ఉన్న తమ ప్రస్తుత వాటాల్ని 20 శాతానికి ( 4% to upto 20%) పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒప్పందం ప్రకారం విలీనం తర్వాత ఏర్పడే బోర్డులో ఎక్కువ మంది డైరెక్టర్లను సోనీ గ్రూపే నియమించనుంది.

 

Also Read : ZEEL, Sony merger: జీల్, సోనీ విలీనంపై కీలక ప్రకటన.. మీడియా ప్రపంచంలో కీలక పరిణామం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News