Meta Facebook Services: ఇండియాలో ఎక్స్‌ప్రెస్ సేవల్ని నిలిపివేసిన ఫేస్‌బుక్
Meta Facebook Services: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత చౌకగా వైఫై అందించేందుకు ప్రవేశపెట్టిన ఎక్స్‌ప్రెస్ వైఫై సేవల్ని ఆ సంస్థ నిలిపివేసింది.
Meta Facebook Services: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత చౌకగా వైఫై అందించేందుకు ప్రవేశపెట్టిన ఎక్స్‌ప్రెస్ వైఫై సేవల్ని ఆ సంస్థ నిలిపివేసింది.
ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్‌బుక్ , వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఎక్స్‌ప్రెస్ వైఫై సేవల్ని ఇండియాలో నిలిపివేసింది. అతి తక్కువ ఖర్చుతో వైఫై అందించే ఉద్దేశ్యంతో ఎక్స్ స్ వైఫైను 2016లో ఫేస్‌బుక్ ప్రారంభించింది. కేవలం 4 వందల రూపాయలకే 20 జీబీ ఇంటర్నెట్ అందించే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, మొబైల్ ఏరియా శాటిలైట్ ఆపరేటర్లు..వైఫై వ్యాపారంలో ఎదిగి ఆదాయం పొందేందుకు వీలుంటుంది. ఎక్స్‌ప్రెస్ వైఫై సౌకర్యం ద్వారా చవకైన, వేగవంతమైన, నాణ్యమైన సేవల్ని అందించేందుకు ప్రయత్నించింది. 2016లో ప్రారంభించిన ఈ సేవల్ని దాదాపు ఆరేళ్ల తరువాత నిలిపివేసింది. ఇండియాలో గత 2 వారాలుగా ఈ సేవలు అందుబాటులో లేవు.
ఫేస్‌బుక్ (Facebook) ప్రవేశపెట్టిన ఈ ఎక్స్‌ప్రెస్ వైఫై ప్రాజెక్టుపై పలు ఆరోపణలు వచ్చాయి. సేవల్లో అంతరాయాలు వస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ. మెటా అందిస్తూ వస్తున్న ఉచిత ఇంటర్నెట్ సేవల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ వంటి దేశాల్లో వినియోగదారులకు అనవసరమైన ఛార్జీల భారంతో పాటు స్వలాభం కోసం మెటా ఉపయోగించుకుంటుందనే వార్తలు విన్పించాయి. మెటా (Meta)ఎక్స్‌ప్రెస్ వైఫై అనుకున్న లక్ష్యాల్ని సాధించలేకపోగా..విమర్శలు ఎదుర్కొంది. బహుశా అందుకే ఈ సేవల్ని మెటా ఇండియాలో నిలిపవేసినట్టు సమాచారం.
అయితే ఎక్స్‌ప్రెస్ వైఫై సేవల్ని నిలిపివేసినా..ఇంటర్నెట్ సర్వీసెస్ విభాగంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టులు కొనసాగనున్నాయని మెటా వివరించింది. పార్ట్‌నర్స్‌తో కలిసి ఎక్స్‌ప్రెస్ వైఫై వేదిక ద్వారా 30 కంటే ఎక్కువ దేశాల్లో పబ్లిక్ వైఫై యాక్సెస్ కోసం ప్రయత్నిస్తోంది. ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టేందుకు ఈ ప్రాజెక్టు నిలిపివేసినట్టు మెటా తెలిపింది. కస్టమర్లకు లేదా యూజర్లకు మెరుగైన సేవలందించేందుకు భాగస్వామ్యులతో కలిసి పని చేసేందుకు సిద్ఘమని వెల్లడించింది.
Also read: Car Rental: మారుతి సుజుకి బంపరాఫర్.. రూ.12 వేలకే నెల పాటు అద్దె కారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook