Mistakes To Avoid Before Applying For Personal Loans : ఆర్థిక ఇబ్బందులు, అత్యవసర పరిస్థితులు ఎప్పుడూ చెప్పి రావు. హఠాత్తుగా అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైనా అప్పటివరకు దాచుకున్న డబ్బులోంచి తీసి ఆ అత్యవసర పరిస్థితులను అధిగమిస్తారు. ఒకవేళ అలా దాచుకున్న డబ్బులు లేవంటే చాలామందికి వెంటనే కనిపించే మార్గం పర్సనల్ లోన్స్. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులే కాకుండా పెళ్లిళ్లు, పేరంటాలు, ఉన్నత చదువులు, ఇంట్లో మరమ్మతులు... ఇలా కారణాలు, అవసరాలు ఏవైనా .. మీకు సరైన అర్హతలు ఉంటే మీకు పర్సనల్ లోన్ ఇవ్వడానికి ఎన్నో బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే.. అంతకంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇంతకీ తెలుసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటి ? తెలుసుకోకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.


క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోకపోవడం ..
మీకు పర్సల్ లోన్ మంజూరు చేయాలంటే బ్యాంకులు ముందుగా మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది అని చెక్ చేస్తాయి. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 750 కంటే తక్కువగా ఉండటంతో పాటు గతంలో ఏవైనా లోన్స్ పెండింగ్‌లో ఉండటం గానీ లేదా ఏవైనా డీఫాల్ట్ లోన్స్ కానీ ఉంటే బ్యాంకులు మీకు లోన్ ఇవ్వకుండా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తాయి. అది మీ క్రెడిట్ హిస్టరీలో ఒక మచ్చగా మిగిలిపోతుంది. అందుకే పర్సనల్ లోన్ అనే కాదు.. ఎలాంటి లోన్ కోసం అప్లై చేసినా ముందుగా మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు.


పర్సనల్ లోన్ ఆఫర్స్ గురించి ఆరా తీయండి ..
పర్సనల్ లోన్‌పై ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన ఆఫర్స్ ఇస్తుంటాయి. ఏ బ్యాంక్ ఎలాంటి ఆఫర్ ఇస్తుందో చెక్ చేయండి. వేర్వేరు బ్యాంకుల ఆఫర్లతో పాటు ఎందులో తక్కువ వడ్డీ రేటు, తక్కువ డాక్యుమెంటేషన్ రిస్క్, తక్కువ ప్రాసెసింగ్ ఫీజు ఉన్నాయి అనే అంశం బేరీజు వేసుకోండి. అందులో ఏది బెస్ట్ ఆఫర్ ఐతే.. ఆ బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకోండి.


షరతులు సరిగ్గా చదవకపోవడం ..
చాలామంది లోన్ కోసం దరఖాస్తు చేసే హడావుడిలో ఎక్కడపడితే అక్కడ సంతకాలు పెట్టేస్తారు కానీ ఆ లోన్ రీపేమెంట్‌లో ఉండే షరతులు, వడ్డీ రేట్లు, ప్రీ-క్లోజింగ్, చార్జీలు, పెనాల్టీలు వంటి వాటి విషయంలో బ్యాంకు ఏం చెబుతోంది అనే షరతులు చదవరు. అలా చేస్తే లోన్ తిరిగి చెల్లించే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులకు బ్యాంకులు బాధ్యత వహించవు కాబట్టి లోన్ కోసం అప్లై చేయడానికి ముందే ఒకసారి షరతులు చదవండి.


సమాచారం దాచిపెట్టడం ..
పర్సనల్ లోన్ కావాలనే ఆశతోనో లేక అవసరం వల్లో ఎలాంటి సమాచారం దాచిపెట్టకూడదు. ఎందుకంటే మీకు సంబంధించిన ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న లోన్స్ ఏవైనా ఉంటే వాటి వివరాలు ఇవ్వాలని బ్యాంక్స్ కోరుతాయి. మీరు ఆ వివరాలు దాచిపెట్టి బ్యాంకులో లోన్ కోసం వెళ్లినా... మీ సిబిల్ స్కోర్ రిపోర్టులో ఆ డీటేల్స్ ఉంటాయి. అప్పుడు మీరు వివరాలు దాచిపెట్టినందుకు మీ లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కారణాలు ఏవైనా.. మీకు ఒకసారి లోన్ రిజెక్ట్ అయితే.. మళ్లీ వెంటనే లోన్ కోసం దరఖాస్తు చేసుకోలేరు. అంతేకాకుండా అది మీ సిబిల్ స్కోర్‌పై దుష్ప్రభావం చూపిస్తుంది.


ఇది కూడా చదవండి : Ola S1 X Electric Scooters: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్.. 2 వారాల్లోనే 75 వేల బుకింగ్స్


పర్సనల్ లోన్స్ ఇఎంఐలతో సహా నెలవారీ బడ్జెట్ ప్లాన్ .. 
పర్సనల్ లోన్‌కి అప్లై చేయడానికి ముందే ప్రతీ నెల ఇఎంఐ కోసం ఎంత అవసరం అవుతుంది, అలాగే ఇంట్లోవారి ఖర్చులు ఎంత ఉంటాయి, ఎంత సంపాదిస్తే ఆ రెండింటినీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేసుకోగలం అని బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. లేదంటే పర్సనల్ లోన్ ఇఎంఐ తిరిగి చెల్లించే సమయంలో ఏమైనా అనుకోని ఖర్చులు వచ్చినా లేదా ఇఎంఐకి అవసరమైన డబ్బులు లేకపోయినా.. మీరు ఇఎంఐ చెల్లించలేకపోతే మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినడమే కాకుండా అదనంగా భారీ మొత్తంలో వడ్డీలు, ఇతర అపరాధ రుసుం వంటి పెనాల్టీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి : Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్‌లో లాంచ్ అవుతున్న కొత్త కార్లు, వాటి ఫీచర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి