Union Bank Of India Offering Free Processing Fee: మీరు ఇల్లు లేదా కారు లోన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నారా..? ఎక్కడ తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి..? ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నారా..? అయితే మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఇల్లు లేదా కారును కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకున్న వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ లోన్లపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదని వెల్లడించింది. గృహ రుణాలు, టూ లేదా ఫోర్ వీలర్ లోన్‌లు తీసుకోవాలనుకునే కస్టమర్లకు ఉచిత ప్రాసెసింగ్ ఫీజులను బ్యాంక్ ప్రకటించింది. అయితే అందరూ వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించదు.
మీరు యూనియన్ బ్యాంక్‌లో జీరో ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్‌ను పొందాలంటే.. మీ క్రెడిట్ స్కోర్ 700 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అదేవిధంగా మీరు ఏదైనా ఎన్‌బీఎఫ్‌సీ లేదా ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ చేసినప్పుడు కూడా మీరు ఈ తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ఆఫర్ ఆగస్ట్ 16వ నుంచి ప్రారంభమైందని.. నవంబర్ 15వ తేదీ వరకు ఉంటుందని తెలిపింది. ఆర్‌బీఐ రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత యూనియన్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం ఈ ప్రత్యేక సౌకర్యాన్ని తీసుకొచ్చింది.
ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు
బ్యాంక్ 7 నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీ సౌకర్యాన్ని అందిస్తుంది. 3 నుంచి 7 శాతం చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్లపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక వడ్డీని ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీపై 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ ఇస్తారు. పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై బ్యాంక్ 6.70 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. మరోవైపు సీనియర్ సిటిజన్లకు 5 నుంచి 10 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 7.20 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
Also Read: West Bengal Fire Accident: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది దుర్మరణం
Also Read: Pakistan ODI Rank: వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ టీమ్‌గా పాకిస్థాన్.. భారత్ ర్యాంక్ ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook