MTNL Best Plan: ఆ కంపెనీ ప్రకటించిన అద్భుతమైన ఆఫర్ దిగ్గజ కంపెనీలకు చెమటలు పట్టించేసింది. కేవలం 150 రూపాయలకు ఏడాది వ్యాలిడిటీ ఇస్తుండటం అందరి మతి పోగొడుతోంది. ఆ ఆఫర్ ఏంటి, టెలీకం కంపెనీ పేరేంటనే వివరాలు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో టెలీకం కంపెనీలు మూకుమ్మడిగా ధరలు పెంచేస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు ప్లాన్స్ ధరలు పెంచడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో ఈ మూడు కంపెనీలు తక్కువ ధరతో చవకైన ప్లాన్స్ విడుదల చేశాయి. ఇప్పుడు మరో కంపెనీ ఈ మూడు కంపెనీలకు దిమ్మ తిరిగే ఆఫర్ ఇస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ కంపెనీ ప్రకటించిన ప్లాన్‌తో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలకు ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. 


ఈ కొత్త ప్లాన్ ప్రకటించింది ఎంటీఎన్ఎల్ కంపెనీ. 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తున్న అద్భుతమైన ప్లాన్ ఇది. అది కూడా కేవలం 141 రూపాయలకే. ఆశ్చర్యంగా ఉందా..నిజమే. హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంటుంది. 141 రూపాయల ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. దాంతోపాటు ఈ ప్లాన్‌లో తొలి 90 రోజులకు ప్రతిరోజదూ 1జీబీ డేటా ఉంటుంది. దాంతోపాటు ఎంటీఎన్ఎల్ నెట్వర్క్‌కు అన్‌లిమిటెడ్ కాలింగ్ వెసులుబాటు ఉంటుంది. 


ఇక ఇతర నెట్‌వర్క్‌కు కాల్ చేయాలంటే 2 వందల నిమిషాలు ఉచితంగా లభిస్తాయి. 2 వందల నిమిషాలు పూర్తయితే..నిమిషానికి 25 పైసలు ఛార్జ్ అవుతాయి. అది కూడా తొలి 90 రోజులకే. ఆ తరువాత మీకు ప్రతి సెకండ్ కు 0.02 పైసలు ఛార్జ్ అవుతాయి. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకూ ఇంత చవకైన ప్లాన్ ప్రకటించలేదు.


Also read: Gyanvapi masjid Issue: జ్ఞానవాపి మసీదులో కొత్త వివాదం, అడ్వకేట్ కమీషనర్ అజయ్ మిశ్రా వర్సెస్ విశాల్ సింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook