Multibagger Stocks: షేర్ మార్కెట్ అంటే ఓ లోతైన అగాధం. అదృష్టం, దురదృష్టం రెండూ ఉంటాయి. కొన్ని షేర్లు పెట్టుబడిదారులకు బంపర్ ఆఫర్లు అందిస్తాయి. 7 రూపాయల షేర్ 318 రూపాయలకు చేరుకోవడమంటే అదే కదా మరి...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షేర్ మార్కెట్ అంటేనే ఓ వింత మాయ ప్రపంచం. ఎప్పుడు ఎవరిని అందలమెక్కిస్తుందో..పడేస్తుందో తెలియదు. ముందుచూపు, తెలివితేటలతో పాటు అదృష్టం కూడా ఉండాల్సిందే. అదే జరిగింది. ఒకప్పుడు 7 రూపాయలున్న ఓ కంపెనీ షేర్ ఇప్పుడు 318 రూపాయలకు చేరుకుంది. పెట్టుబడిదారులకు లాభాలు ఆర్జించింది.


అంబర్ ప్రోటీన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ షేర్ ఇది. ఈ కంపెనీ షేరు పెట్టుబడిదారులకు 4,237.41 శాతం లాభాలు ఇచ్చింది. అంబర్ ప్రోటీన్ ఇండస్ట్రీస్ స్టాక్ గత 1-5 ఏళ్ల కాలంలో ఇన్వెస్టర్లను లక్షాధికారులుగా మార్చిన 2022 మల్టీ బ్యాగర్ స్టాక్స్ జాబితాలో చేరింది. అంబర్ ప్రోటీన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కంపెనీ. మార్కెట్ విలువ కేవలం 183.31 కోట్లు. అహ్మదాబాద్ కేంద్రంగా ఈ కంపెనీ నడుస్తోంది. 


ఈ స్టాక్ ఇప్పుడు 52 వారాల అత్యధికం 318.80 రూపాయలకు చేరుకుంది. గత 52 వారాల్లో కనిష్టంగా 11.91 రూపాయలుంది. ఐదేళ్ల క్రితం ఇందులో ఓ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే..అదిప్పుడు 43.37 లక్షల రూపాయలకు చేరుకుంది.సెప్టెంబర్ 6, 2021 నాటికి కంపెనీ షేర్ కేవలం 11.91 రూపాయలే. కానీ కేవలం ఏడాది వ్యవధిలో కంపెనీ షేర్ అమాంతంగా పెరిగింది. పెట్టుబడిదారులకు 2,576.74 శాతం రిటర్న్ ఇచ్చింది. స్టాక్ 306.89 రూపాయలకు చేరుకుంది. కనీసం ఏడాది క్రితం ఎవరైనా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే..అదిప్పుడు 26.76 లక్షలకు చేరుకునేది.


ఇక వైటీడీ స్టాక్ గురించి కూడా చెప్పుకోవాలి. జనవరి 4వ తేదీన ఈ స్టాక్ విలువ 22.25 రూపాయలు కాగా ఇప్పుడీ కంపెనీ షేర్ 1332.81 శాతం రిటర్న్ అందించింది. జనవరిలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే..అదిప్పుడు 14.32 లక్షలకు చేరుకునేది. అంతేకాదు..ఆరు నెలల క్రితం ఈ స్టాక్ విలువ 29.65 రూపాయలుగా ఉంది. గత 6 నెలల్లో 975.21 శాతం రిటర్న్ ఇచ్చింది. స్టాక్ విలువ ఇప్పుడు 289.15 రూపాయలకు చేరుకుంది. 


Also read: Gold Price Today: పండగ పూట స్వల్పంగా పెరిగిన పసిడి ధర... ఎంత పెరిగిందంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook