Twitter Pay: ట్వీట్స్‌కు డబ్బులు వసూలు చేస్తే ఎలా ఉంటుంది..? ఆదాయం కోసం మస్క్ ప్రయత్నం!
ట్విట్టర్ టాప్ మెనేజ్‌మెంట్ లో ఉన్న వాళ్లను ఒక్కొక్కరిని బయటకు పంపించేస్తున్న మస్క్ ఆ పోస్టుల్లో తనకు అనుకూలంగా ఉన్నవాళ్లను పెట్టుకుంటున్నారు. రానున్న రోజుల్లో ట్విట్టర్‌ను గ్లోబల్ న్యూస్ ఏజెన్సీగా మార్చేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నారని సమాచారం.
Twitter pay: అపర కుబేరుడు ఎలన్ మస్క్ ప్రజల భావస్వేచ్ఛకు ప్రతీకగా మారిన ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆయన ప్రతీ రోజు ట్రెడింగ్ టాపిక్‌గా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన గురించి చర్చించని రోజు అంటూ లేదు. ప్రతీ రోజు ఆయనకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాను తెగ డబ్బులు పోసి కొన్న ట్విట్టర్‌ను ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మార్చేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు ఎలన్ మస్క్. దీంతో ఆయన ప్రతీరోజు వార్తల్లో నిలుస్తున్నారు.
ట్విట్టర్ టాప్ మెనేజ్‌మెంట్ లో ఉన్న వాళ్లను ఒక్కొక్కరిని బయటకు పంపించేస్తున్న మస్క్ ఆ పోస్టుల్లో తనకు అనుకూలంగా ఉన్నవాళ్లను పెట్టుకుంటున్నారు. రానున్న రోజుల్లో ట్విట్టర్‌ను గ్లోబల్ న్యూస్ ఏజెన్సీగా మార్చేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇందు కోసం కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ లో నిర్వహణ, నిర్మాణ పనుల్లో తీసుకురావాల్సిన మార్పుల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలస్తోంది. మరో వైపు ట్విట్టర్‌కు ఆదాయమార్గాలను అన్వేషించే పనిలో కూడా పడ్డారు ఎలన్ మస్క్.
ఈపాటికే తన దగ్గర ఉన్న డబ్బుల్లో పెద్ద మెత్తాన్ని ట్విట్టర్ పై పెట్టుబడి పెట్టడంతో ఇప్పుడు సరిపడ డబ్బులు లేక ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు మస్క్.
ఇందు కోసం ట్వీట్‌ను మానిటైజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఎక్కువగా వైరల్ అయినా ట్వీట్స్ ద్వారా డబ్బులు ఆర్జించే మార్గాన్ని అన్వేషిస్తున్నారని సమాచారం. ఇకపై ట్విట్టర్‌కు సంబంధించిన ట్వీట్లను ఎంబెడ్ చేసినా లేదా ఎక్కడైనా కోట్ చేసినా అందుకు తగిన విధంగా ఫీజులు వసూలు చేయాలని మస్క్ భావిస్తున్నారు. దీంతో పాటుగా ట్విట్టర్‌లో సబ్‌స్క్రిప్షన్ సర్వీసులను కూడా తీసుకురావాలని భావిస్తున్నారని సమాచారం.
ఈ మార్పుల కోసం అవసరం అయితే మస్క్ నేరుగా సీఈఓగా మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ట్విట్టర్‌ను ముందు ఆదాయ వనరుగా మార్చాలని ఆయన భావిస్తున్నారు. ఇందు కోసం ముందు తన వాళ్లతో ప్రయత్నించాలని భావిస్తున్నారు. ఒక వేళ అన్ని ప్రయత్నాలు విఫలం అయితే చివరి ప్రయత్నంగా తాను సీఈఓ గా మారి ట్విట్టర్ వ్యవహారాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు.
Also Read Redmi Offer: Redmi 9A Sport మొబైల్ పై ప్రత్యేక ఆఫర్.. రూ.349 ధరకే అందుబాటులో!
Aalsor Read మరో ప్రభుత్వ రంగ సంస్థను హస్తగతం చేసుకోనున్న టాటా గ్రూప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook