Mutual Fund Calculator: రోజుకు రూ.500 ఇన్వెస్ట్ చేయండి.. కోటీశ్వరులు అవ్వండి ఇలా..
Mutual Fund Investment: మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నారా..? దీర్ఘకాలంలో పెట్టుబడిపెట్టి భారీ లాభాలను అర్జించాలని చూస్తున్నారా..? రోజుకు రూ.500 ఇన్వెస్ట్ చేస్తే.. మీరు 15 ఏళ్లలో కోటీశ్వరులు కావచ్చు. పూర్తి వివరాలు ఇలా..!
Mutual Fund Investment: ప్రస్తుతం ఎక్కువమంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. దీర్ఘకాలికంగా పెట్టుబడిపెడితే.. మంచి లాభాలు వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువమంది ఆకర్షితులవుతున్నారు. సరైన మార్గంలో అన్ని సరిచూసుకుని ఇన్వెస్ట్ చేస్తే.. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు. మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతూ.. స్వల్ప వ్యవధిలోనే కోటీశ్వరులు కావచ్చు. ఎలాగో తెలుసుకోండి..
మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీ దీర్ఘకాలంలో ప్రయోజనాలను పొందడానికి పెట్టుబడిదారులకు మంచి ఎంపిక. దీంతో చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇన్వెస్టర్‌గా మీరు రూ.కోటి సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. 15x15x15 రూల్‌ను పాటించాలి. ఈ నియమాన్ని పాటిస్తే.. మీరు 15 ఏళ్లలో కోటీశ్వరులు అవుతారు.
మ్యూచువల్ ఫండ్స్ 15x15x15 రూల్ ప్రకారం.. 15 శాతం వార్షిక రాబడిని ఇచ్చే ఫండ్‌లో 15 సంవత్సరాల కాలానికి ప్రతి నెలా రూ.15 వేల పెట్టుబడి పెట్టాలి. అంటే నెలలో 30 రోజుల పాటు ప్రతిరోజూ రూ.500 చొప్పున పెట్టుబడి పెట్టాలి. ఇలా మీరు 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సగటున 15 శాతం వార్షిక ఆదాయాన్ని ఆర్జించే ఈ ఫార్ములా కింద 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.15 వేలతో మీరు కోటి రూపాయలను పొదుపు చేసుకోవచ్చు. ప్రతి నెలా రూ.15 వేలు పెట్టుబడి పెడితే.. 15 సంవత్సరాలలో మీ అసలు మొత్తం రూ.27 లక్షలు అవుతుంది.
మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌పై వడ్డీపై వడ్డీని సంపాదించే అవకాశం ఉంటుంది. తద్వారా మీ పెట్టుబడి కాలక్రమేణా ఎప్పటికప్పుడు మీ డబ్బు పెరుగుతూనే ఉంటుంది. 15 శాతం వార్షిక రాబడిని ఇచ్చే స్టాక్‌లో 15 సంవత్సరాల పాటు నెలకు కేవలం రూ.15000 ఇన్వెస్ట్ చేస్తే.. మీరు రూ.1,00,27,601 ఫండ్‌ను పొదుపు చేసుకోవచ్చు. మీరు కేవలం రూ.27 లక్షల ఇన్వెస్ట్ చేస్తే.. రూ.73 లక్షల లాభంగా పొందవచ్చు. అంటే రోజుకు రూ.500 పెట్టుబడి పెడితే.. మరో 15 ఏళ్లలో కోటీశ్వరులు కావచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి