Nationwide strike: దేశవ్యాప్తంగా బంద్ కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం!
ట్రేడ్ యూనిటన్ల పిలుపు మేరకు రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంక్ ఉద్యోగులు నిరసన ప్రదర్సనలు చేస్తున్నారు. దీనితో వివిధ బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం పడినట్లు బ్యాంకులు చెబుతున్నాయి.
Nationwide strike: ట్రేడ్ యూనిటన్ల పిలుపు మేరకు రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంక్ ఉద్యోగులు నిరసన ప్రదర్సనలు చేస్తున్నారు. దీనితో వివిధ బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం పడినట్లు బ్యాంకులు చెబుతున్నాయి.
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఐటీయూసీ), సెంటర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ యూనియన్స్ (సీఐటీయూ), నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ) సహా వివిధ యూనిట్లు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి.
పలు ప్రభుత్వ రంగ బ్యాంకు ఇప్పటికే సమ్మే కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావ పడినట్లు ప్రకటించాయి. పలువురు ఉద్యోగులు సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ విధులకు హాజరుకాకపోవడం రోజు వారీ కార్యకలాపాలపై ప్రభావం పడినట్లు తెలిపాయి. ప్రైవేటు బ్యాంకుల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
బంద్‌కు కారణాలు..
రెండు ప్రభుత్వం రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం, కార్మిక చట్ట సవరణకు వ్యతిరేకంగా.. మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద్ వేతనాలు పెంచడం, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం వంటి డిమాండ్లతో యూనియన్లు సమ్మె నిర్వహిస్తున్నాయి. ఇవాళ, రేపు సమ్మె చేయాలని యూనియన్లు నిర్ణయిచాయి.
సమ్మె వల్ల బ్యాంకుల్లో ఈ సేవలకు అంతరాయం..
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వివిధ లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఉద్యోగుల విధులకు హాజరవకపోవడం ఇందుకు కారణం.
చెక్ క్లియరెన్స్‌కు సాధారణం కన్నా అధిక సమయం పట్టొచ్చు. ప్రభుత్వం ట్రేజరీ లావాదేవీలు కూడా ఆలస్యం కావచ్చు.
ఉత్తరాధి రాష్ట్రాల్లో ప్రభుత్వం రంగ బ్యాంకులు చాలా వరకు మూతపడ్డాయి. దీనితో లావాదేవీలపై ప్రభావం పడనుంది.
ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులు తెరుచుకున్నప్పటికీ.. సిబ్బంది లేకపోవడం వల్ల రోజువారీ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి.
రెండు రోజుల సమ్మె కారణంగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశముంది.
వినియగదారులు బ్యాంక్‌లో ఏదైనా పని ఉంటే ఈ రెండు రోజులు వాయిదా వేసుకోవడం లేదా.. ఆన్లైన్ ద్వారానే పూర్తి చేసుకోవడడం మంచిదని సూచిస్తున్నారు బ్యాంక్ అధికారులు.
Also read: Petrol price Today: సామాన్యులపై మళ్లీ పెట్రో వాత.. 7 రోజుల్లో ఆరోసారి ధరల పెంపు
Also read: PVR-Inox Mega Merger: మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలో మెగా విలీనం... ఒక్కటైన పీవీఆర్, ఐనాక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook