Netflix New India Plans Cut Prices now starting at ₹149 per Month: నెట్‌ఫ్లిక్స్.. సభ్యత్వ ధరలను తగ్గించింది. మనదేశంలో ఈ ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇప్పుడు చాలా చౌకగా మారాయి. నెట్‌ఫ్లిక్స్ (Netflix) తన కొత్త ధరలను వెల్లడించింది. నెలకు రూ. 199కి బదులుగా రూ. 149 (నెట్‌ఫ్లిక్స్ రూ. 149 ప్లాన్) ప్లాన్‌ను కొత్తగా తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్. గతంలో ప్లాన్ మినిమమ్ (Plan minimum) రూ. 199తో ప్రారంభమయ్యేది. ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను (subscribers) ఆకర్షించేందుకే నెట్‌ఫ్లిక్స్ ఈ కొత్త ప్లాన్‌లను తీసుకొచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనదేశంలో నెట్‌ఫ్లిక్స్ కు పోటీగా చాలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ (OTT Platforms) ఉన్నాయి. దీంతో తనకు పోటీగా ఉన్న ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రైబర్‌లందరినీ ఆకర్షించేందుకు నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక కొత్తగా సభ్యత్వం తీసుకునేవారికి గరిష్టంగా 60శాతం దాకా తగ్గింపు లభించనుంది. 


గతంలో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ (Netflix Mobile plan) రూ.199గా ఉండేది. అది ఇప్పుడు రూ.149కి అందుబాటులోకి వచ్చింది. అలాగే రూ.499 బేసిక్ ప్లాన్ (Netflix Basic plan) ఇప్పుడు రూ.199గా మారింది. గతంలో నెలకు రూ. 649 స్టాండర్డ్ ప్లాన్ (Netflix Standard plan) ఇప్పుడు రూ. 499గా మారింది. అలాగే రూ. 799 ప్లాన్ (ప్రీమియం) ప్రస్తుతం రూ. 649కే లభిస్తోంది. ఈ కొత్త ప్లాన్స్‌తో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్.. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ తో పాటు మరిన్ని ఇతర వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు గట్టి పోటీనే ఇవ్వనుంది. 



 


Also Read : Vivo V23 Pro: అతి త్వరలోనే మార్కెట్‌లోకి వివో V23 ప్రో.. ఫీచర్స్ అదిరిపోలా! ధర ఎంతంటే?


రూ.149 ప్లాన్


నెట్‌ఫ్లిక్స్ రూ.149 మొబైల్‌ ప్లాన్ లో (Netflix Mobile plan) ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ ప్లాన్ తీసుకుంటే 480p రిజల్యూషన్‌తో మొబైల్ లేదా టాబ్లెట్‌లో నెట్‌ఫ్లిక్స్‌ వీడియోలను ప్లే చేయొచ్చు. ఈ ప్లాన్‌ ద్వారా.. ఒక ఖాతాను ఒకేసారి ఒక డివైజ్‌కు మాత్రమే యాక్సెస్ చేయవచ్చు.


నెట్‌ఫ్లిక్స్ రూ.199 ప్లాన్


రూ. 199 ప్లాన్‌లో 480p రిజల్యూషన్‌తో వీడియోలు చూడొచ్చు. ఈ ప్లాన్ తీసుకుంటే కంప్యూటర్‌లు, టీవీలలో కూడా నెట్‌ఫ్లిక్స్ ఉపయోగించడానికి వీలు అవుతుంది.


నెట్‌ఫ్లిక్స్ రూ. 499 ప్లాన్


రూ. 499 స్టాండర్డ్ ప్లాన్‌తో 1080p రిజల్యూషన్‌తో ఒకేసారి రెండు డివైజ్‌లలో కూడా నెట్‌ఫ్లిక్స్ వీడియోలను చూడొచ్చు. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్‌లు మొబైల్, టాబ్లెట్, కంప్యూటర్, టీవీలలో ఏదైనా డివైజ్‌లో నెట్‌ఫ్లిక్స్ వీడియోలను చూడొచ్చు. 


రూ.649 ప్లాన్


రూ.649 ప్లాన్ అనేది ప్రీమియం ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా ఒకేసారి నాలుగు డివైజ్‌లలో నెట్‌ఫ్లిక్స్ వీడియోలను చూసే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్లాన్‌ సబ్‌స్క్రైబర్‌లు 4K రిజల్యూషన్ లో కూడా కంటెంట్‌ను చూడొచ్చు. మొబైల్, (Mobile) టాబ్లెట్, కంప్యూటర్. టీవీ ఇలా అన్ని డివైజ్‌లలో నెట్‌ఫ్లిక్స్ (Netflix) వీడియోలను స్ట్రీమింగ్ చేయొచ్చు. 



 


Also Read : రోజుకు కేవలం రూ.20 పొదుపు చేస్తే చాలు... రూ.1.88 కోట్లు పొందవచ్చు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook