New Model Maruti Swift 2024: ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ మారుతి సుజుకి తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫోర్త్‌ జనరేషన్‌ స్విఫ్ట్‌ మే నెలలో లాంచ్‌ కాబోతోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన కొన్ని వివరాలను కంపెనీ వెల్లడించింది. అయితే కంపెనీ కారు ధర నిర్ణయించక ముందే మారుతి డీలర్స్‌ స్విఫ్ట్‌ బుకింగ్‌ ప్రక్రియను ప్రారంభించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మారుతి సుజుకికి సంబంధించిన డీలర్‌షిప్‌లలో బుకింగ్‌ ప్రక్రియలు కూడా పూర్తి అయిన్నట్లు తెలుస్తోంది. మీరు కూడా అతి తక్కువ ధరలోనే మంచి కారును కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. అయితే ఈ కొత్త స్విఫ్ట్‌ను ఇప్పుడే బుకింగ్‌ చేసుకుంటే మే నెలలో డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కారును బుకింగ్ చేసే క్రమంలో డబ్బును ఎంత చెల్లించాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ.11,000 చెల్లించాల్సి ఉంటుంది:
త్వరలోనే లాంచ్‌ కాబోయే ఫోర్త్‌ జనరేషన్‌ స్విఫ్ట్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగానే ప్రీ బుకింగ్‌ చేయాలనుకుంటే రూ.11,000తో చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ ఈ బుకింగ్‌ ప్రక్రియను అధికారికంగా ప్రకటించలేదు. అయితే త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


వేరియంట్స్‌, రంగులు:
ఇక ఈ కొత్త స్విఫ్ట్‌ వేరియంట్స్‌ వివరాల్లోకి వెళితే, మారుతి సుజుకి కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మొదట కంపెనీ LXi, VXi వేరియంట్స్‌ను లాంచ్‌ చేసి, ఆ తర్వాత ZXi, ZXi+ వేరియంట్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కారు కలర్స్‌ విషయానికొస్తే, ఇది బ్లూ, రెడ్, వైట్, సిల్వర్, బ్లాక్‌తో పాటు ఆరెంజ్ కలర్స్‌తో పాటు మొత్తం ఏడు వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. 


డిజైన్ వివరాలు?:
డిజైన్‌కి సంబంధించిన వివరాలు చూస్తే, 2024 స్విఫ్ట్ కొత్త ఫ్రంట్ రియర్ బంపర్స్, ఫ్రెష్ గ్రిల్ డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌తో ఎల్-సైజ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. అలాగే అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు షార్క్-ఫిన్ యాంటెన్నతో రాబోతున్నట్లు తెలుస్తోంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


ఇంజన్ పవర్ట్రైన్:
త్వరలోనే లాంచ్‌ కాబోయే స్విఫ్ట్ 1.2-లీటర్ Z12E పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తోంది. దీంతో పాటు మరో వేరియంట్‌ 1.2-లీటర్ K12C ఇంజన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కారు ఇంజన్ 82hp పవర్, 108Nm టార్క్‌ను ఉత్పత్తితో రాబోతోంది. అలాగే కారుకు సంబంధించిన మైలేజీ వివరాల్లోకి వెళితే..23.4kmpl మైలేజీని ఇస్తుంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి