New Small Business Ideas: మీరు బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? ఎక్కువ డిమాండ్ దేనికి ఉందని ఆలోచిస్తున్నారా..? ఏ వ్యాపారం అయినా కస్టమర్ రిపీట్ వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే అంత సక్సెస్ అవుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. మీరు కూడా అలాంటి వ్యాపారమే ప్రారంభించండి. ప్రస్తుత కాలంలో కూరగాయలకు చాలా డిమాండ్ ఉంది. ప్రతి ఇంట్లో నిత్యం కూరగాయలు వాడాల్సిందే. ఆరోగ్యానికి ఆకుపచ్చ కూరగాయలను నిపుణులు సిఫార్సు చేస్తున్న నేపథ్యంలో స్వచ్ఛమైన వాటిని ప్రజలు ఎగబడి కొంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కూరగాయల వ్యాపారం ఎలా ప్రారంభించాలి..?


మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా.. ఆ వ్యాపారం గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. తద్వారా సులభంగా వ్యాపారం చేసుకోవచ్చు. వ్యాపారం కోసం మీకు తాజా కూరగాయలు అవసరం. హోల్‌సేల్‌ ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకురావాలి. మీకు రైతుల పొలాలు దగ్గరగా ఉంటే.. అక్కడికి వెళ్లి కొనుగోలు చేస్తే ఇంకా మంచి ఆదాయంతోపాటు ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి.


మీరు మార్కెట్ నుంచి కూరగాయలను కొనుగోలు చేయవచ్చు. విక్రయించవచ్చు. మీరే రైతు అయితే.. మీ పొలంలో వాటిని నాటడం ద్వారా కూరగాయలు పండించి అమ్ముకోవచ్చు. మీరు తక్కువ ధరకు ఏదైనా కూరగాయల అమ్మకందారుల నుంచి కూరగాయలను కొనుగోలు చేయవచ్చు. 


వెజిటెబుల్ బిజినెస్‌కు ప్లేస్ అత్యంత ముఖ్యమైనది. కూరగాయల వ్యాపారం కోసం మీకు ఓ దుకాణం అవసరం. మార్కెట్‌కి వెళ్లి వ్యాపారం కూడా చేసుకోవచ్చు. అలాంటి చోట దుకాణం ప్రారంభించాలి. ఎక్కువ మంది వచ్చే చోట దుకాణం ఓపెన్ చేస్తే బాగా వ్యాపారం జరిగే అవకాశం ఉంటుంది. మీకు ఓపిక ఉంటే.. ఓ బండిపై కూరగాయలు ఉంచి ఇంటింటికీ వెళ్లి అమ్ముకోవచ్చు. 


ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు లైసెన్స్ అవసరం కావచ్చు. చిన్న తరహా వ్యాపారం ప్రారంభిస్తే..  లైసెన్స్ అవసరం ఉండదు. పెద్దస్థాయి వ్యాపారం కోసం మీరు FSSAI నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు బండిపై కూరగాయలు విక్రయిస్తే.. మీకు ఎక్కువ ఖర్చు అవ్వదు. 500 నుంచి 1000 రూపాయలకు కూరగాయలు తెచ్చి అమ్మవచ్చు. ఆ తరువాత క్రమంగా మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. కూరగాయల వ్యాపారంలో ఖర్చు మీపై ఆధారపడి ఉంటుంది. మీరు పెద్ద ఎత్తున ప్రారంభిస్తే.. మీకు ఒకటి నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది.
 
కూరగాయల వ్యాపారానికి కాలంతో సంబంధం లేదు. ఎప్పుడు నడుస్తుంది. డిమాండ్ కూడా ఎప్పటికీ తగ్గదు. కూరగాయలు ఖరీదైనప్పుడు మార్కెట్‌లో ధరలు కూడా పెరుగుతాయి. రెట్టింపు ధరకు కూరగాయలను అమ్ముకోవచ్చు. మీకు తక్కువ ఖర్చులో వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉంటే.. వెజిటెబుల్ బిజినెస్ ప్రారంభించడం ఉత్తమం.


Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఓపీఎస్‌పై కీలక ఉత్తర్వులు  


Also Read: Andrey Botikov: కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్త హత్య.. బెల్టుతో గొంతు కోసి దారుణం  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook