Nita Ambani's stylish look:  నీతా అంబానీ.. ఆమెకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. 60ఏళ్లు నిండినా..పాతికేళ్ల అమ్మాయిలానే కనిపిస్తుంది. నీతా ధరించే డ్రెస్సులు, ప్రత్యేకించి చీరలు, నగలకు కూడా ఎంతో మంది అభిమానులు ఉంటారు. నీతా అంబానీకి డ్రెస్సింగ్ సెన్స్ ఎక్కువ. చీర నుంచి వెస్ట్రన్ డ్రెస్సుల వరకు ఎంతో అందమైన దుస్తువులను డిజైన్ చేయించుకుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీతాఅంబానీ మరోసారి సింపుల్ వెస్ట్రన్ లో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొన్నారు. ఈ బిజినెస్ మీటింగ్ కు ఐకాన్ బ్లేజర్ లుక్ తో వచ్చి బాస్ ఉమెన్ ఎనర్జీని అందరిలోనూ వ్యాపించేలా చేశారు. వస్త్రధారణ, విలాసవంతమైన ఆభరణాలు అంటే నీతా అంబానీకి ఎంతో ఇష్టం. 


ముంబై ఇండియన్స్ అఫిషీయల్ ఇన్ స్టాగ్రామ్ పేజీలో నీతా అంబానీకి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేశారు. బ్లేజర్ లో ఎంతో కాన్ఫిడెన్స్, హుందాతనాన్ని ప్రసరింపజేస్తూ.. పవర్ డ్రెస్సింగ్ ను చాటి చెప్పే మహిళగా నీతా అంబానీ గురించి క్యాప్షన్ కూడా పెట్టారు. 


Also Read: Hyderabad Real Estate: హైదరాబాద్‎లో ఇల్లు కావాలంటే..ఈ ప్రాంతాల్లో చాలా  చౌక.. అద్దెను ఈఎంఐగా చెల్లిస్తే చాలు  


ఇక డబుల్ కాలర్, నాచ్డ్ లాపెల్స్ తో కూడిన లేత  పింగ్ కలర్ షేడ్లో ఉన్న బ్లేజర్ ను నీతా అంబానీ ధరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించే నీతా అంబానీ ఈ బ్లేజర్ ను కస్టమ్ ఎం ఇనిషియల్ తో డిజైన్ చేసారు. సింపుల్ వైట్ ట్యాంక్ టాప్ తో ఆమె తన సిల్హౌట్ ను చక్కగా ధరించారు. హై వె్ట్ జీన్స్ ను ధరించి చాలా అందంగా కనిపించారు. 


 





లగ్జరీ టచ్ లేకుండా  కనిపించారు. అందుకే ఆమె ఈ సింపుల్ డ్రెస్ పై ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ధరించారు. హై ఎండ్ యాక్సెసరీస్ కు నీతా అంబానీ చాలా ఫేమస్. ఈ బ్లేజర్ పై డైమండ్ స్టడ్ చెవిపోగులు, హార్ట్ షేపులో ఉన్న పెండెంట్ నెక్లెస్, వైట్ కలర్ రిస్ట్ వాచ్, న్యూడ్ స్టైల్ హై హీల్స్ ను ధరించారు. 


Also Read: Legal Documents: సిటీలో మంచి ప్రాపర్టీ కొనాలంటే ఏ డాక్యుమెంట్స్‌ ఉండాలి? అందరూ తప్పక తెలుసుకోవాల్సిన మేటర్!  


ఇక నీతా అంబానీ ధరించి పింక్ హ్యాండ్ బ్యాక్ లగ్జరీని సూచిస్తుంది. పింక్ అండ్ వైట్ కలర్ లో ఉన్న బ్యాంక్ చాలా అద్భుతంగా ఉంది. ఈ హ్యాండ్ బ్యాగ్ ధర రూ 12వందల డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో 9లక్షల రూపాయలు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter