Petrol and Diesel Price: వాహనదారులకు కాస్త శుభవార్త. నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు  పెరగడం లేదు. దీంతో వాహనదారులు కాస్త రిలీఫ్ అవుతున్నారు.  కిందటి నెల రోజుల నుంచి ధరలు పెరగకపోవడంతో పెట్రో ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని ఉదయం ఆయిల్ సంస్థలు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ రేట్ల డేటాతో నిర్దారణ అయిపోయింది.  దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో ఎక్కడ కూడా గత కొంత కాలంగా ధరల్లో మార్పు రాలేదు. అయితే ఆయా రాష్ట్రాల్లో విధించిన ట్యాక్సుల కారణంగా అక్కడక్కడ కొంత మేర ధరలు పెరిగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరుసగా 35 రోజులు నుంచి ధరలు నిలకడగా  ఉండడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఆయిల్ సంస్థలు తాజాగా విడుదల చేసిన డాటా ఆధారంగా దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105 పలుకుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో ఇదే పెట్రోల్ ధర రూ.120గా నమోదు అయింది. ఇక డీజిల్ విషయానికి వస్తే డీజిల్ ధర ఢిల్లీ, ముంబైలో రూ.96.67గా, రూ.104.77గా నమోదు అయ్యాయి.  ఇక మన హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.119.49 ఉండగా... డీజిల్ లీటరు ధర రూ.105.49 నమోదు అయింది. ఆయా రాష్ట్రాల్లో విధిస్తున్న స్థానిక ట్యాక్స్ ల కారణంగా ధరల్లో మార్పులు నమోదు అవుతున్నాయి. 


అంతర్జాతీయ సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాల ఆధారంగా ఇక్కడ పెట్రో ధరల్లో మార్పు వస్తోంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అప్పుడు ధరలు పెంచేందుకు ఆసక్తి చూపని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల తర్వాత ఇబ్బడిమబ్బడిగా ధరలు పెంచేస్తున్నాయి. దీంతో ధరల పెరుగుదలలో ఘణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలప్పుడు ధరలు పెంచకపోడంతో ఆయిల్ సంస్థలు అప్పట్లో ఏకంగా రూ.19 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయాయని  మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తన నివేదికలో పేర్కొంది. మన దగ్గర అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు క్రూడాయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ కు 82 డాలర్ల నుంచి 120 డాలర్లకు పెరిగినా అప్పట్లో ఆయిల్ సంస్థలు కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు ధరలు పెంచలేదు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఆదాయన్ని కోల్పోయిన ఆయిల్ సంస్థలు భారీగా ధరలు పెంచి నష్టాన్ని పూడ్చుకున్నాయి. రెవెన్యూ లోటు భర్తీ అయిన తర్వాత మళ్లీ ధరల పెరుగుదలను నిలిపివేశాయి. దీంతో గత 35 రోజులుగా ఆదాయంలో పెరుగుదల నమోదు కాలేదని తెలుస్తోంది. 


Also Read Apple Ipod Touch: యాపిల్ కీలక నిర్ణయం... ఇక 'ఐపాడ్ టచ్'కు స్వస్తి...


Also Read Realme Narzo 50 5G Launch: రియల్ మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్.. ఫీచర్స్ ఏంటంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook