Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. అన్నదాతకు అధిక ప్రయోజనం కల్పించేందుకు సిద్ధమైంది. రైతులతో ఆ మేరకు ఒప్పందం కుదర్చుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లో(Flipkart)ఇక నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కూడా లభ్యం కానున్నాయి. అది కూడా నేరుగా రైతులు పండించినవే. రైతుల్నించే కొనుగోలు చేసి ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. రైతుల్నించి నేరుగా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి విక్రయించేందుకు ఆన్‌లైన్ ఈ కామర్స్ ఫ్లిప్‌కార్ట్ ముందుకొచ్చింది. రైతులకు అధిక ఆదాయం కల్పించే విధంగా రైతు ఉత్పత్తి సంఘాలతో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ముందు అనంతపురం జిల్లాలోని సత్యసాయి ఫార్మర్ ఫెడరషన్, ఏపీ మహిళాభివృద్ధి సొసైటీలతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ రెండు రైతు సంఘాల(Farmer Products)నుంచి వేరుశెనగ, పప్పుధాన్యాలు, మసాలా దినుసుల్ని కొనుగోలు చేయనుంది. 


నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల్ని(Farmer product on Flipkart) వినియోగదారులకు అందించేందుకు విత్తు నుంచి పంట ఉత్పత్తి, ప్యాకింగ్ వరకూ తీసుకోవల్సిన జాగ్రత్తలపై రైతులకు శిక్షణ కూడా ఇవ్వనుంది ఫ్లిప్‌కార్ట్. అన్నిచోట్ల ప్యాకేజింగ్, ప్రోసెసింగ్ యూనిట్లు నెలకొల్పనుంది. మహిళా సాధికారత పెంచేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, టాటా ట్రస్ట్‌లతో కలిసి పనిచేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. మహిళలు ఉత్పత్తి చేస్తున్న వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులకు ఆన్‌లైన్ ద్వారా మార్కెటింగ్ అవకాశాలు కల్పించనున్నారు. 


Also read: PhonePe transaction charges: ఫోన్ పే యూజర్స్‌కి షాక్.. మొబైల్ రీచార్జీపై ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook