OLA Scooter Unit: ఆ ఫ్యాక్టరీలో 10 వేలమంది మహిళలకు ఉద్యోగాలు
OLA Scooter Unit: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా మరోసారి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. ఓలా మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం మహిళలలో నింపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ కీలక విషయాల్ని వెల్లడించింది.
OLA Scooter Unit: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా మరోసారి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. ఓలా మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం మహిళలలో నింపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ కీలక విషయాల్ని వెల్లడించింది.
ఓలా. క్యాబ్ సర్వీస్ రంగం నుంచి ఆటోమొబైల్ రంగానికి విస్తరించిన ప్రముఖ కంపెనీ. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లో ప్రవేశపెడుతూ సంచలనం సృష్టించిన కంపెనీ. ఇప్పుడా కంపెనీ ఛైర్మన్, సీఈఓ భవిష్ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు. మరో సెన్సేషన్ సృష్టించనున్నారు. ఓలా(OLA) మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మహిళలతో రన్ అయ్యే ప్రపంచంలోని అతిపెద్ద ఫ్యాక్టరీగా మార్చనున్నారు. తమిళనాడులోని ఓలా మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో పదివేలమంది మహిళలకు ఉద్యోగాలు కల్పించనున్నారు. అదే జరిగితే మొత్తం 5 వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కంపెనీ మహిళలతో రన్ అయ్యే ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ కానుంది. మొత్తం యూనిట్‌ను మహిళా ఉద్యోగులతో నింపాలనేది సీఈఓ భవిష్ ఆగర్వాల్ ఆలోచనగా ఉంది. ఆత్మనిర్భర్ భారత్ కాస్తా ఆత్మనిర్భర్ విమెన్‌గా మారాలని ఆయన చెబుతున్నారు.
ఓలా 2020 లో తమిళనాడు(Tamilnadu)లో పెట్టనున్న ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola Electric Scooter Factory)ఫ్యాక్టరీకు 2 వేల 4 వందల కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఏడాదికి పది లక్షల వార్షిక ఉత్పత్తి కెపాసిటీతో ప్రారంభించనుంది. క్రమంగా మార్కెట్ డిమాండ్‌ను బట్టి 20 లక్షల వరకూ పెంచనుంది. అయితే పూర్తిగా యూనిట్ పూర్తయిన తరువాత ఏడాదికి ఓలా కోటి యూనిట్లు ఉత్పత్తి చేయగలదంటున్నారు. అంటే ప్రపంచంలో జరిగే టూవీలర్ ప్రొడక్షన్‌లో 15 శాతం. మహిళలకు ఆర్ధికంగా అవకాశాలు కల్పించేందుకు చేసిన మొదటి వర్క్‌ఫోర్స్ అని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. దేశాన్ని నైపుణ్యంతో నింపేందుకు, ఉద్యోగాభివృద్ధి పెంచేందుకు మహిళా వర్క్‌ఫోర్స్ పెంచాల్సిన అవసరముందని అంటున్నారు.
Also read: Zomato: నిత్యావసర సేవలకు జొమాటో గుడ్ బై...ఈ నెల 17 నుంచి సేవలు నిలిపివేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook