Ola Electric Share Price : సెబీ చైర్ పర్సన్ పై హిండెన్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాధమి బచ్ తోపాటు ఆమె భర్తపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్  కంపెనీలకు చెందిన షేర్ల విలువలను పెంచేందుకు సహయపడిన అంతర్జాతీయ ఫండ్లలో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఛైర్ పర్సర్ దంపతులకు షేర్స్ ఉన్నాయని హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. అయితే హిండెన్ బర్గ్ ఆరోపణలను వీరిద్దరూ తీవ్రంగా ఖండించారు. హిండెన్ బర్గ్ వ్యాఖ్యలు అర్థరహితం అంటూ కొట్టిపారేశారు. అయినా కూడా హిండెన్ బర్గ్ వ్యాఖ్యల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సోమవారం సెషన్ ఆరంభంలో 400 పాయింట్లకు పైగా పడిపోయాయిన సూచీలు..నెమ్మదిగా కోలుకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 అయితే ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ షేర్లు భారతీయ స్టాక్ మార్కెట్‌లో కేవలం 2 ట్రేడింగ్ సెషన్‌లకు మాత్రమే లిస్ట్ అయ్యియి.  ఈ రెండు సెషన్‌లలో స్టాక్ అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కంపెనీ IPO శుక్రవారం మార్కెట్లో లిస్ట్ అయ్యింది. కానీ వరుసగా రెండో రోజు స్టాక్ 20శాతం పెరిగింది.   సోమవారం కూడా షేరు ధరలు నిరంతరంగా పెరుగుతూ వచ్చాయి.  స్టాక్ 20శాతం పెరుగుదలతో కాసుల పంట పండిస్తోంది. 


Also Read : Family Pension : ప్రైవేట్ ఉద్యోగులూ..మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలా? అయితే ఈ స్కీమ్ లో చేరండి..!!


76 రూపాయల వద్ద ఫ్లాట్‌గా లిస్ట్ అయిన ఓలా ఎలక్ట్రిక్ షేర్ ఇప్పుడు కేవలం 2 రోజుల్లోనే 109 రూపాయలకు చేరింది. అంటే IPO ధరతో పోలిస్తే ఈ షేర్ కేవలం 2 రోజుల్లోనే 44శాతం పెరిగిందన్నమాట. కంపెనీ తన IPO ధరను రూ. 76 వద్ద ఉంచగా.. ఇది ఈ ధరతో NSEలో లిస్టయ్యింది. కాగా, ఒక్కో షేరు ధర రూ.75.99తో బీఎస్‌ఈలో లిస్టైంది. శుక్రవారం రూ.91.18 వద్ద ముగియగా, నేడు ఒక్కో షేరు రూ.109.41కి చేరుకుంది. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ  రూ.6,145 కోట్ల IPO 4.27 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఐపీఓ కోసం మొత్తం 1,98,79,03,905 షేర్లకు బిడ్లు రాగా, 46,51,59,451 షేర్లు అమ్మకానికి వచ్చాయి. ఈ విధంగా IPO 4.27 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది.


 కొనుగోలుదారుల విభాగం 5.31 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందగా, రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల వర్గం 3.92 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 2.40 రెట్లు బిడ్లు వచ్చాయి. IPO కింద, 5,500 కోట్ల రూపాయల విలువైన కొత్త షేర్లు,  8,49,41,997 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ఉంచారు. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ దాదాపు 3.8 కోట్ల ఈ షేర్లను అమ్మకానికి పెట్టారు.


కాగా గత కొంతకాలంగా చాలా ఐపీఓలు లిస్టింగ్ తోనే మంచి రిటర్న్స్ సాధించినప్పటికీ..ఓలా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో స్టాక్ మార్కెట్లు కరెక్షన్స్ లో ఉన్నాయి. లాభాలను సొమ్ము చేసుకునేందుకు షేర్లను అమ్మారు. ఈక్రమంలోనే భారీ డిమాండ్ ఉన్నప్పటికీ ఓలా స్టాక్ మాత్రం ఫ్లాట్ ఎంట్రీ ఇచ్చింది. 


Also Read : Explainer : వివాదాల్లో సెబీ చైర్ పర్సన్..మెట్టు దిగకుండా మొండి పట్టుదల ఎందుకు? రాజీనామా చేయాలంటూ వరుస డిమాండ్లు..!!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook