OLA Electric Scooter: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా ఇప్పుడు తయారీరంగంలో అడుగెడుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలో మార్కెట్లో విడుదల చేయనుంది. ఫ్యాక్టరీ తొలి దశ పనులు పూర్తి కానున్నట్టు సంస్థ సీఈవో స్వయంగా ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓలా (Ola)అనగానే క్యాబ్ సర్వీస్ గుర్తుకొస్తుంది. బుక్ చేసిన నిమిషాల వ్యవధిలో మీ ముందు క్యాబ్ లేదా ఆటో లేదా బైక్ ఉంటుంది. మిమ్మల్ని మీ గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చుతుంది. ఇప్పుడీ సంస్థ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌లో అడుగెడుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో రానున్నాయి. తమిళనాడులో(Tamilnadu) ఓలా ఫ్యూచర్ (Ola Future) ఫ్యాక్టరీ నిర్మాణం 2 వేల 4 వందల కోట్ల పెట్టుబడితో కొనసాగుతోంది.ఈ ఫ్యాక్టరీ తొలిదశ పనులు ఇప్పుడు పూర్తి కావస్తున్నాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ స్వయంగా ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ తయారు కానుందని చెప్పారు. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ స్టేజ్1 పూర్తి కాబోతోంది. స్కూటర్లు త్వరలో రానున్నాయి అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో..పెయింట్ ఆర్డర్ చేయాల్సిన సమయం వచ్చేసింది..ఎలాంటి రంగు కోరుతున్నారంటూ ట్వీట్ చేశారు. 


భవిష్ అగర్వాల్ షేర్ చేసిన పోస్టులో ఓలా స్కూటర్(Ola Scooter) కనీస డిజైన్ కలిగి ఉండి..స్కూటర్ చుట్టూ ఎల్ఈడీ డీఆర్ఎల్ ప్రత్యేకమైన ట్విన్ హెడ్ ల్యాంప్ క్లస్టర్ ఉంది. దేశంలోని 4 వందల నగరాలు, పట్టణాల్లో లక్షకు పైగా ఛార్జింగ్ పాయింట్లను ఓలా సంస్థ ఏర్పాటు చేయనుంది. సింగిల్ ఛార్జ్‌లో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మొదటి ఏడాదిలో 5 వేల ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. ఓలా స్కూటర్ ధర ఎంత ఉండబోతుందో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఓలా విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌( Electric Scooter)పై ఆసక్తి నెలకొంది. 


Also read: Central government: కొత్త ఇళ్లు కొనాలనుకుంటున్నారా..అయితే మీకోసమే ఈ గుడ్‌న్యూస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook