Earn Money with Chat GPT: ప్రస్తుతం ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. చాలా మంది ఫోన్ నుంచే పని చేస్తూ నెలకు కొంత మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఎక్కువ మంది చాట్ జీపీటీని ఉపయోగించి తమ పనిని మరింత సులభతరం చేసుకుంటున్నారు. అంతేకాదు ఆన్‌లైన్‌లో డబ్బులు సాధించే సాధనంగా కూడా మారింది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఏఐ సాధనాలను ఉపయోగించి.. రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అర్జిస్తున్నారు. మీరు కూడా ఏఐ సాధనాలను ఉపయోగించి ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాట్ జీపీటీని ఉపయోగించి కంటెంట్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. మీకు ఏ టాపిక్‌పై అయినా.. పూర్తి సమాచారం కావాలంటే చాట్ జీపీటీలో తెలుసుకోవచ్చు. మెయిల్స్ రాయాలన్నా.. రాజీనామా లెటర్లు రాయాలన్నా చాట్ జీపీటీతో సింపుల్‌గా పని అయిపోతుంది. అదేవిధంగా యూట్యూబ్ క్రియేటర్‌లు తమ వీడియోను రూపొందించే ముందు కంటెంట్‌ను రెడీ చేసుకోవాలి. ఆ కంటెంట్‌కు వాయిస్ ఓవర్‌ ఇచ్చి యూట్యూబ్‌లో ఫొటోలు సెట్ చేసి వీడియోను అప్‌లోడ్ చేసేందుకు చాలా సమయం పడుతుంది.


Also Read: Ambati Rayudu: పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్‌కు అంబటి రాయుడు రెడీ.. అక్కడి నుంచే పోటీ..?


అయితూ చాట్ జీపీటీ వచ్చిన తరువాత యూట్యూబ్‌లో వీడియోలు క్రియేట్ చేయడం మరింత సులభమైంది. యూట్యూబర్లు కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు చాట్ జీపీటీ సాయం తీసుకుంటున్నారు. కంటెంట్ క్రియేట్ అయిన తరువాత ఏఐ సాఫ్ట్‌వేర్‌లకు అప్‌లోడ్ చేస్తారు. ఏఐ వాయిస్ లేదా ఏఐ యాంకర్ ఈ కంటెంట్‌ని చదువుతారు. అనంతరం కొన్ని నిమిషాల వ్యవధిలోనే.. కంటెంట్, ఆడియో కలిపి వీడియో రెడీ అయింది. ఫొటోలు, వీడియోలను మిక్స్ చేసిన తరువాత యూట్యూబ్ క్రియేటర్లకు వీడియో సిద్ధమవుతుంది. యూట్యూబ్‌లో ఎక్కువ సబ్‌స్కైబర్లు ఉన్నవాళ్లు ప్రతి నెల లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.


Also Read: Pawan Kalyan Speech: సీఎం కావడానికి నేను సంసిద్ధం.. తల తెగినా మాటకు కట్టుబడి ఉంటా: పవన్ కళ్యాణ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి