PPF Investment Plan: ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. తల్లిదండ్రుల్లో కూడా పిల్లల భవిష్యత్తుపై ఆందోళన పెరుగుతోంది. పిల్లల చదువు, పెళ్లి ఖర్చులకు డబ్బు సమకూరుస్తామో లేదో? అనే ఆందోళన ఎక్కువవుతోంది. మీరు ఇలాంటి ఇబ్బంది ఎదర్కొంటే మీకు ఓ సరైన పెట్టుబడి పథకాన్ని పరిచయం చేస్తున్నాం. ఇందులో మంచి లాభాలతోపాటు అతితక్కవ డబ్బుతో పెట్టుబడి పెట్టొచ్చు. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ దీన్నే పీపీఎఫ్ అని కూడా అంటాం. మైనారిటీ తీరకముందే మీ పిల్లల పేరుపై కూడా పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ప్రతినెలా కొంత డబ్బును జమా చేస్తూ ఉంటే పిల్లలు పెద్దయ్యేసరికిక డబ్బు కూడా పెరుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీపీఎఫ్ ఖాతా తెరవడానికి కావాల్సిన పత్రాలు..
పీపీఎఫ్ ఖాతా తెరవడానికి మైనారిటీ తీరని పిల్లల పేరుపై ఓపెన్ చేయవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ లేదు.దీన్ని మీరెప్పుడైనా తెరవచ్చు. ముఖ్యంగా పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేసే సంబంధిత బ్యాంకునకు వెళ్లి ఫారమ్ 1 లో మీ వివరాలను నమోదు చేయాలి. గతంలో ఈ ఫారమ్ ను ఫారమ్ A అని పిలిచేవారు.


ఇదీ చదవండి:  PF ఖాతాదారులకు గుడ్ న్యూస్‌.. పెరిగిన వడ్డీరేటు ఎంత? ఎప్పుడు జమా చేస్తారంటే?


పీపీఎఫ్ ఖాతాను ఎలా ప్రారంభించాలి?
ఈ ఖాతాను ఓపెన్ చేయడానికి తల్లిదండ్రుల వద్ద సరైన పాస్ట్‌పోర్ట్‌, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఆధార్, రేషన్ కార్డులో ఏదైనా అడ్రస్ ప్రూఫ్ గా కలిగి ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్‌నకు మాత్రం పాన్ కార్డు, ఆధార్, ఓటర్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి. ఖాతా ప్రారంభించే సమయంలో మీరు రూ.500 చెక్ ఇవ్వాలి ఉంటుంది. పేపర్ వర్క్ అంతా పూర్తయ్యాక పీపీఎఫ్ పాస్ బుక్ ను పిల్లల పేరు మీద బ్యాంకు సిబ్బంది మీకు అందజేస్తారు.


రూ.32 లక్షలు ఎలా పొందాలి?
పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేసి రూ.32 లక్షలు ఎలా పొందాలో తెలుసుకుందాం.
ప్రస్తుతం మీ పిల్లలు మూడేళ్ల వయస్సు ఉంటే వారిపేరుపై ఈ ఖాతా ఓపెన్ చేస్తే మెచూరిటీ టైం 18 ఏళ్లు అవుతుంది.
 అంటే 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ మీరు ప్రతినెలా రూ.10 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.కావాలంటే మరిన్ని రోజులు ఖాతాను పొడిగించుకోవచ్చు.


ఇదీ చదవండి:  99.99% ప్యూర్ ప్రభుత్వ గోల్డ్ బాండ్స్ కొనడానికి మరో గోల్డెన్ ఛాన్స్..!


15 ఏళ్లు ప్రతినెలా రూ.10  వేలు జమాచేయాలి. దీనిపై మీకు 7.10 శాతం వడ్డీ అందుతుంది. మీ ఖాతా మెచూరిటీ నాటికి రూ.3,216,241  మీ పిల్లల ఖాతాలో జమా అవుతుంది. దీన్ని చదువు లేదా పెళ్లి ఖర్చులకు ఆ సమయానికి ఉపయోగపడతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి