OPPO foldable smartphones launching date: ఒప్పో నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయ్. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కి పికాక్ అనే కోడ్‌నేమ్ పెట్టింది. గిజ్మోచైనా వెల్లడించిన వివరాల ప్రకారం గెలాక్సీ జడ్ ఫోల్డ్ 3, హవాయి మేట్ ఎక్స్2 (Galaxy Z Fold3, Huawei Mate X2) తరహాలోనే లోపలికి మలిచే విధంగా ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ ఉండనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

120 రిఫ్రెష్ రేటుతో, 8 ఇంచుల LTPO OLED డిస్‌ప్లే ప్యానెల్ కలిగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 888 చిప్‌ని అమర్చనున్నారు. ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ గురించి వస్తున్న కథనాల ప్రకారం ఈ ఫోన్‌లో కలర్ ఓఎస్ 12 ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఓఎస్ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ 12 ఉంటుందా లేక గతేడాది వచ్చిన ఆండ్రాయిడ్ 11 ఉంటుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. 


Also read : Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఈ-మోటార్​ సైకిళ్లు- ఆ తర్వాత విద్యుత్ కార్లు!


స్మార్ట్ ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు లో-టెంపరేచర్ పాలిక్రిస్టలైన్ ఆక్సైడ్ (LTPO display) డిస్ ప్లే పరిజ్ఞానంతో ఈ ఫోన్ ని రూపొందించారు. 


ఇక ప్రైమరి కెమెరా విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో సోని లెన్స్‌తో తయారు చేసిన 50MP Camera ను అమర్చారు.


గేమింగ్, ఎంటర్‌టైన్మెంట్‌కి బ్రేకుల్లేకుండా ఉండేందుకు 4,500mAh battery ని అమర్చడంతో పాటు స్పీడ్ చార్జింగ్ (Speed charging) కోసం 65W చార్జింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.


Also read : Apple Store Workers: స్టోర్​ ఉద్యోగులకు రూ.223 కోట్లు చెల్లించేందుకు యాపిల్ ఓకే!


ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్‌తో పాటు ఒప్పో రెనో 7 సిరీస్‌కి చెందిన కొత్త మోడల్ ఫోన్స్‌ని (OPPO Reno7 series smartphones) సైతం ఒప్పో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.


Also read : 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook