Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఈ-మోటార్​ సైకిళ్లు- ఆ తర్వాత విద్యుత్ కార్లు!

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ వ్యాపార విస్తరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే విద్యుత్ స్కూటర్లను విడుదల చేసిన ఈ సంస్థ త్వరలోనే ఎలక్ట్రిక్ మోటార్​ సైకిళ్ల తయారీ విభాగంలోకి ప్రవేశించనుంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 04:16 PM IST
  • ఓలా ఎలక్ట్రిక్ నుంచి విద్యుత్ మోటార్​ సైకిళ్లు
  • ఆ తర్వాత కార్ల విభాగంలోకి ప్రవేశించే అవకాశం
  • అధికారికంగా ధ్రువీకరించిన కంపెనీ సీఈఓ
Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఈ-మోటార్​ సైకిళ్లు- ఆ తర్వాత విద్యుత్ కార్లు!

Ola Electric developing electric motorcycles: విద్యుత్ ఈ-స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను (Ola electrice e-scooters) లాంఛ్ చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్​ సైకిళ్లపై దృష్టి సారించింది.

ఎలక్ట్రిక్ మోటార్​ (Ola Electrice e-bikes) సైకిళ్లను, బడ్జెట్ ధరలో స్కూటర్లను తీసుకురానున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపక సీఈఓ భవీశ్​ అగర్వాల్ ట్విట్టర్ (Bhavish Aggarwal on Ola Electrice e-bikes) ద్వారా ధ్రువీకరించారు. ఎలక్ట్రిక్ మోటార్​ సైకిళ్ల గురించి వివరాలను తెలిపిన ఓ ట్వీట్​ను జోడిస్తూ.. 'Yes next year' అంటూ స్పష్టతనిచ్చారు.

ఈ విషయంపై ఆయన తన బ్లాగ్​లో కూడా రాసుకొచ్చారు. ఎలక్ట్రిక్ బైక్​లతో పాటు.. కార్ల వ్యాపారంలోకి తమ సంస్థ విస్తరించొచ్చని సంకేతాలిచ్చారు.

Also read:Tips For reduce Expenses: ఈ టిప్స్​తో అనవసర ఖర్చులకు చెక్ పెట్టండి!

ఎలక్ట్రిక్​ స్కూటర్ల వ్యాపారంలో రికార్డులు..

ఈ ఏడాది ఆగస్టులో ఓలా ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఎస్‌1, ఎస్‌1ప్రో వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే విక్రయాలు చెపట్టింది. డిసెంబర్ నుంచి రెండో విడత విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో ఈ సంస్థ వాహనాలను టెస్ట్‌డ్రైవ్‌ల కోసం వినియోగదారులకు  అందుబాటులో ఉంచింది కూడా.
మొదటి విడతలో.. తొలి 24 గంటల్లో సెకనుకు 4 స్కూటర్ల చొప్పున రూ.600 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్ముడయ్యాయి. రెండో రోజు నాటికి ఆ విక్రయాలు రూ.1,100 కోట్ల విలువకు చేరుకున్నాయి. వాహన రంగ చరిత్రలోనే ఇదో రికార్డని భవీష్‌ అప్పట్లో పేర్కొన్నారు.

Also read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం

Also read: SBI Card Alert: ఎస్​బీఐ కార్డ్​ యూజర్లకు షాక్​- ఈఎంఐ లావాదేవీలకు ఛార్జీల బాదుడు!

ఓలా ఫ్యాక్టరీ గురించి..

బెంగళూరుకు కొద్దిదూరంలో 'ఓలాఫ్యూచర్‌ ఫ్యాక్టరీ' పేరిట అతిపెద్ద తయారీ యూనిట్‌ను నిర్మిస్తోంది. 500 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు దిచక్ర వాహన తయరీ కేంద్రంగా చెబుతున్నారు విశ్లేషకులు.

ఓలాఫ్యూచర్‌ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నిర్వహిస్తుండటం విశేషం. ఈ ఫ్యాక్టరీ పూర్తిగా సిద్ధమైతే 10 వేల మందికి పైగా మహిళలు ఇందులో పని చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పని చేస్తున్నారు.

Also read: Apple Store Workers: స్టోర్​ ఉద్యోగులకు రూ.223 కోట్లు చెల్లించేందుకు యాపిల్ ఓకే!

Also read: Rakesh Jhunjhunwala: ఆకాశ ఎయిర్​ నుంచి బోయింగ్​కు రూ.75 వేల కోట్ల ఆర్డర్​?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News