Apple Store Workers: స్టోర్​ ఉద్యోగులకు రూ.223 కోట్లు చెల్లించేందుకు యాపిల్ ఓకే!

Apple: టెక్ దిగ్గజం యాపిల్​కు కాలిఫోర్నియా కోర్టులో చుక్కెదురైంది. స్టోర్లలో పని చేసే ఉద్యోగులకు తనిఖీ సమయానికీ వేతనాలు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 07:21 PM IST
  • టెక్​ దిగ్గజం యాపిల్​కు​ మరోషాక్​
  • కొలిక్కి వచ్చిన 2013 నాటి ఓ కేసు
  • స్టోర్ వర్కర్లకు 29.9 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధం
Apple Store Workers: స్టోర్​ ఉద్యోగులకు రూ.223 కోట్లు చెల్లించేందుకు యాపిల్ ఓకే!

Apple Inc agreed to pay 29.9 million USD to employees: అమెరికాకు చెందిన లగ్జరీ గాడ్జెట్స్​ తయారీ సంస్థ యాపిల్​కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కాలిఫోర్నియాలోని యాపిల్ స్టోర్లలో పని చేసే  ఉద్యోగులకు (Apple store workers) 29.9 మిలియన్ డాలర్ల పరిహారంగా చెల్లించేందుకు సిద్ధమైంది. మన కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.223 కోట్లపైమాటే.

దాదాపు ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఓ కేసు  కొలిక్కి వచ్చిన నేపఫథ్యంలో ఈ మొత్తాన్ని ఉద్యోగులకు చెల్లించేందుకు అంగీకరించింది యాపిల్.

ఇంతకీ కేసు ఏమిటంటే..

సాధారణంగా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులను వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు తనిఖీ చేయడం సర్వ సాధారణంగా జరుగుతుంది. అయితే కాలిఫోర్నియాలో ఉన్న యాపిల్ స్టోర్లలో ఈ తనిఖీ సమయం మరీ ఎక్కువగా ఉంటోందని ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కాగా తనిఖీ సమయానికి కూడా తమకు వేతనాలు చెల్లించాలని కంపెనీని డిమాండ్ చేశారు.

Also read: SBI Card Alert: ఎస్​బీఐ కార్డ్​ యూజర్లకు షాక్​- ఈఎంఐ లావాదేవీలకు ఛార్జీల బాదుడు!

దీనితో ఈ వ్యవహారంపై తెల్చుకునేందుకు కార్మికులు, యాపిల్​ కోర్టుకెక్కారు. తొలుత ఉద్యోగుల పిటిషన్​ను తిరస్కరించిన కోర్టు.. రెండోసారి విచారణకు అంగీకరించింది. దీనిపై ఇరు వర్గాల వాదించుకునేందుకు సమయం ఇచ్చింది.

Also read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం

సామాన్లు దాచిపెట్టుకొని వెళ్లట్లేదని నిర్దారించడం కోసం తనిఖీలు తప్పవని యాపిల్‌ వాదించింది. ఈ తనిఖీలు అవసరం లేదనుకునేవారు బ్యాగులు తీసుకురావొద్దని ఆదేశించినట్లు తెలిపింది.

చివరకు డిసెంబర్ 2015లో ఉద్యోగులను తనిఖీ చేసే విధానాన్ని నిలిపివేసినట్లు కంపెనీ ఒప్పందంలో తెలిపింది యాపిల్.

అయితే అంతకు ముందు సంవత్సరాలకు గానూ.. తాము కోల్పోయిన సమయానికి వేతనాలు చెల్లించాల్సిందేని కార్మికులు పట్టుబట్టారు. దీనితో తాజాగా దీనిపై కోర్టు తుది తీర్పు వెలువరించింది. కాలిఫోర్నియాలో ఉన్న 52 స్టోర్లకు మత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆయా స్టోర్లలో పని చేసే 14,683 మందికి ఒక్కొక్కరికి 1,286 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని న్యాయవాదులు కోర్టు ఫైలింగ్​లో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై స్పందించేందుకు యాపిల్ నిరాకరించింది. అయితే ఆ మొత్తాన్ని చెల్లించేందుకు మాత్రం రెడీ అయ్యింది.

Also read: Kangana Ranaut: 'నా ప్రశ్నలన్నింటికి సమాధానం చెబితే.. పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్త'

Also read:Terror Attack: అసోం రైఫిల్స్ కాన్వాయ్​పై ఉగ్రదాడి...కల్నల్ కుటుంబంతో సహా పలువురు మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News