OPS Latest Update: ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్
NITI Aayog Meet: పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్న హిమాచల్ ప్రభుత్వం.. ఎన్‌పీఎస్ కింద జమ చేసిన రూ.9,242.60 నిధులు వెనక్కి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు సీఎం సుఖ్‌విందర్ సింగ్. పీఎఫ్ఆర్డీఎకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
NITI Aayog Meet: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్ విధానం అమలు కోసం పోరాడుతున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల నేషనల్ పెన్షన్ సిస్టమ్‌పై ఓ కమిటీ వేసింది. పాత పెన్షన్ విధానంలో ఉండే బెనిఫిట్స్ కొత్త పెన్షన్ విధానంలోనే కల్పించే కమిటీ అధ్యాయనం చేయనుంది. ఈ కమిటీ తుది నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్‌పై ఓ నిర్ణయం తీసుకోనుంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వానికి హిమాచల్ ప్రదేశ్ కొత్త పెన్షన్ స్కీమ్ గురించి డిమాండ్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొత్త పెన్షన్ స్కీమ్ కింద డిపాజిట్ చేసిన రూ.9,242.60 కోట్ల మొత్తాన్ని తిరిగి ఇచ్చేలా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఎ)ని ఆదేశించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు కేంద్రాన్ని కోరారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆయన కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్‌పీఎస్ కింద జమ చేసిన రూ.9,242.60 కోట్ల మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరారు.
ఎన్‌పీఎస్ కింద గతేడాది డిపాజిట్ చేసిన రూ.1,779 కోట్ల మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ పరిమితి నుంచి తగ్గించవద్దని సీఎం సుఖ్‌విందర్ సింగ్ అన్నారు. రాష్ట్రానికి వచ్చే మూడేళ్లపాటు విదేశీ సాయంపై ఉన్న పరిమితిని ఎత్తివేసి.. మునుపటి పరిస్థితిని పునరుద్ధరించాలన్నారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖకు సమర్పించిన ప్రతిపాదనలకు సత్వర ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.
హిమాచల్ ప్రదేశ్‌లో పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో హిమాచల్ ప్రదేశ్ ఉద్యోగులు ఓపీఎస్ ప్రయోజనాలను పొందనున్నారు. ఎన్‌పీఎస్ కింద జమ చేసిన నిధులతోపాటు భానుపల్లి-బిలాస్‌పూర్-లేహ్ రైల్వే లైన్‌కు 100 శాతం కేంద్రం నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని అభ్యర్థించారు. భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర సహకారంగా పరిగణించాలని కోరారు.
Also Read: GT vs MI Highlights: నెట్ బౌలర్ టు మ్యాచ్ విన్నర్.. మోహిత్ శర్మ వాట్ ఏ బౌలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి