PAN Aadhaar Link: ఆధార్‌తో పాన్ లింక్ చేయకుంటే ఏం జరుగుతుంది?
PAN Aadhaar Link: ఆధార్-పాన్ అనుసంధానానికి తుది గడువు సమీపిస్తోంది. గడువులోపు ఈ ప్రక్రియను పూర్తియకుంటే ఏం జరుగుతుంది? గడువు తర్వాత కూడా ఆధార్-పాన్ లింక్ చేయాలంటే జరిమానా ఎంత? అనే వివరాలు మీకోసం.
PAN Aadhaar Link: ఆధార్-పాన్ అనుసంధానానికి ఈ నెలాఖరు (మార్చి 31)తో తుది గడువు ముగియనుంది. ఈ పక్రియ పూర్తి చేసేందుకు ఇప్పటికే పలుమార్లు గడువు పొడగించింది ప్రభుత్వం. దీనితో మరోసారి గడువు పొడగే అకాశాలు లేవు. అయితే చాలా తెలుసుకోవాలనుకుంటున్న విషయమేమిటంటే.. ఆధార్-పాన్ అనుసంధానం చేసుకోకపోతే ఏం జరుగుతుంది? అని..
మరి ఆధార్-పాన్ లింక్ ఎందుకు అవసరం?
గడువులోపు ఆ ప్రక్రియ పూర్తి చేయకుంటే ఏమవుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్-పాన్ లింక్ చేయకుంటే వివిధ పెనాల్టీలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా మీ పాన్ కార్డ్ నిరుపయోగంగా మారుతుంది.
వివిధ ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ అనేది తప్పనిసరి. ముఖ్యగా కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, షేర్ మార్కెట్ల వంటివాటిలో పెట్టుబడి పెట్టాలన్నా పాన్ తప్పనిసరి. ఐటీ రిటర్ను దాఖలు చేయాలన్నా పాన్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్-పాన్ లింక్ లేకుంటే ఈ పనులేవి చేయలేరు.
ఆధార్-పాన్ లింక్ లేకుంటే మార్చి 31 తర్వాత బ్యాంక్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరపడం కుదరకపోవచ్చు.
ఇన్‌కం ట్యాక్స్ చట్టం 1961 ద్వారా రూ.10 వేల వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు.
గడువు తర్వాత కూడా ఆధార్-పాన్ లింక్ చేసేందుకు ఛాన్స్ ఉంది. అయితే ఇందుకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందట. అయితే ఆలస్య రుసుము ఎంత ఉంటుందనేదానిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ వార్తా నివేదికల ప్రకారం జరిమానా రూ.1,000 వరకు ఉండొచ్చని తెలిసింది.
Also read: Maggi Gets Costlier: టీ, మ్యాగీ ప్రియులకు షాక్.. ధరలను పెంచిన హిందుస్థాన్ యూనిలీవర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook