Maggi Gets Costlier: టీ, మ్యాగీ ప్రియులకు షాక్.. ధరలను పెంచిన హిందుస్థాన్ యూనిలీవర్!

Maggi Gets Costlier: టీ, కాఫీ, మ్యాగీ నూడుల్స్ ప్రియులకు షాకింగ్ న్యూస్! మార్చి 14 నుంచి వీటి ధరలను పెంచుతున్నట్లు నెస్లే కంపెనీ ప్రకటించింది. దీంతో బ్రూ కాఫీ ధరలను 3-7%, బ్రూ గోల్డ్ కాఫీ జార్ల ధరలు 3-4%, ఇన్‌స్టంట్ కాఫీ పౌచ్‌ల ధరలు 3% నుంచి 6.66% పెంపు చేస్తున్నట్లు హిందూస్థాన్ యూనిలీవర్ ఓ ప్రకటనలో తెలిపింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2022, 05:52 PM IST
Maggi Gets Costlier: టీ, మ్యాగీ ప్రియులకు షాక్.. ధరలను పెంచిన హిందుస్థాన్ యూనిలీవర్!

Maggi Gets Costlier: పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్యలో ప్రజలు ఇప్పుడు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మ్యాగీ, టీ ప్రియులకు షాకింగ్ న్యూస్ ను హిందూస్థాన్ యూనిలీవర్ (HUL) ప్రకటించింది. నెస్లే తమ ఉత్పత్తులపై ధరలను పెంచేసిన కారణంగా.. ఇకపై టీ, కాఫీ, పాలు, నూడుల్స్ ధరలు కూడా అమాంతం పెరగనున్నాయని హిందూస్థాన్ యూనిలీవర్ ప్రకటించింది. ఈ ధరలు మార్చి 14 నుంచి అమలు కానున్నాయి. బ్రూ కాఫీపై 3 - 7%, బ్రూ గోల్డ్ కాఫీ జార్ ధరను 3 - 4% పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇన్‌స్టంట్ కాఫీ ప్యాకెట్ ధరలు కూడా 3% నుంచి 6.66%కి పెరిగాయి.

మరోవైపు తాజ్ మహల్ టీ ధర 3.7% నుంచి 5.8% కి పెరిగినట్లు హిందూస్థాన్ యూనిలీవర్ పేర్కొంది. బ్రూక్ బాండ్ కంపెనీకి చెందిన అన్ని రకాల టీల ధరలు 1.5% నుంచి 14% వరకు పెరిగాయి. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా నెస్లే కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని HUL పేర్కొంది.

మ్యాగీ ధర 9 నుంచి 16% పెంపు

నెస్లే ఇండియా కూడా మ్యాగీ ధరలను 9 నుంచి 16 శాతం పెంచింది. దీంతో పాటు పాలు, కాఫీ పొడి ధరలను కూడా కంపెనీ పెంచినట్లు HUL పేర్కొంది. ఇప్పుడు పెరిగిన ధర తర్వాత 70 గ్రాముల మ్యాగీ ప్యాకెట్‌కు రూ.12 బదులు రూ.14 లకు అమ్మకానికి ఉంది. మరోవైపు 140 గ్రాముల మ్యాగీ మసాలా నూడుల్స్‌కు రూ. 3 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో 560 గ్రాముల మ్యాగీ ప్యాకెట్‌కు రూ. 96 చెల్లించాల్సి ఉండగా.. ఇప్పుడు దీనికి రూ. 105 వసూలు చేస్తున్నారు.

ఈ ధరలు కూడా పెరిగాయి..

నెస్లే ఒక లీటర్ A+ పాల ధరలను కూడా పెంచేసింది. ఈ పాల ప్యాకెట్ కు గతంలో 75 రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు రూ. 78 ధరకు విక్రయిస్తున్నారు. Nescafe Classic Coffee Powder ధరలు 3 - 7% పెరిగాయి. అదే సమయంలో.. 25 గ్రాముల Nescafe ప్యాక్ ఇప్పుడు 2.5 శాతం పెరిగింది. ఇప్పుడా కాఫీ పౌడర్ కోసం రూ. 78 కు బదులుగా రూ. 80 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు Nescafe క్లాసిక్ కాఫీ 50 గ్రాములు ప్యాకెట్ ను రూ. 145 కాకుండా రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది.  

Also Read: Washing Machine Offers: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.7 వేల బడ్జెట్ లో అమ్మకానికి వాషింగ్ మెషీన్స్!

ALso Read: Earning Money: రూ.399 ఖర్చుతో ప్రతినెలా లక్షల రూపాయలను సంపాదించవచ్చు- అదెలాగో తెలుసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News