Paytm cashback offer: రూ. 4 ట్రాన్స్ఫర్ చేయండి.. రూ. 100 క్యాష్‌బ్యాక్ పొందండి!
Paytm offers: పేటీఎం యూపీఐ ద్వారా నాలుగు రూపాయలు బదిలీ చేస్తే రూ.100 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Paytm Cashback Alert: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్ పేటీఎం (Paytm) వినియోగదారుల కోసం అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. '4 కా 100 క్యాష్‌బ్యాక్'(4 ka 100 cashback) ఆఫర్‌లో భాగంగా...కొత్త కస్టమర్లు పేటీఎం యూపీఐ (Paytm UPI) ద్వారా నాలుగు రూపాయలు బదిలీ చేస్తే రూ.100 హామీ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (Ind vs WI) సిరీస్ మ్యాచ్ రోజుల్లో భాగంగా..ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఈ నెల 20 తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
అంతేకాకుండా పేటీఎం వినియోగదారులు ఈ యాప్ ను వేరే వారికి రిఫర్ చేస్తే...గరిష్టంగా రూ.100 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ రెఫరర్, రిఫరీ..ఇద్దరికి వర్తిస్తుంది. రిఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ద్వారా అదనపు క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవచ్చని కంపెనీ తన అధికారిక పత్రికా ప్రకటనలో పేర్కొంది. టీమిండియా క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, హర్భజన్ సింగ్‌లతో పాటు విండీస్ ఆటగాడు క్రిస్ గేల్‌లు ఆన్‌లైన్ ప్రచాకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
''పేటీఎం యూపీఐ సూపర్‌ఫాస్ట్ నగదు బదిలీలను అందిస్తుంది. ఈ రాబోయే క్రికెట్ సీజన్‌లో, మేము మా వినియోగదారులతో కలిసి క్రీడను జరుపుకోవాలని కోరుకుంటున్నాము, దీని ద్వారా రూ. 100 క్యాష్‌బ్యాక్‌లో''” అని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర యాదవ్ అన్నారు.
Also read: POCO A3 Pro 5G: రూ.17,999 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.249కే సొంతం చేసుకోండిలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook