Ambareesh Murty: గుండెపోటుతో ప్రముఖ వ్యాపారవేత్త అంబరీష్ మూర్తి కన్నుమూత
Pepperfry co-founder Ambareesh Murty: పెప్పర్‌ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. వివిధ కంపెనీల్లో పనిచేసిన ఆయన.. 2011లో ఆశిష్ షాతో కలిసి పెప్పర్‌ఫ్రైని స్థాపించారు. పూర్తి వివరాలు ఇలా..
Pepperfry co-founder Ambareesh Murty: ఆన్‌లైన్ ఫర్నిచర్ స్టోర్ పెప్పర్‌ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి (51) గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్తను పెప్పర్‌ఫ్రై స్టోర్ మరో సహ వ్యవస్థాపకుడు ఆశిష్ షా ట్విట్టర్ ద్వారా తెలిపారు. బైక్ రైడ్ అంటే ఎంతో ఇష్టపడే అంబరీష్.. ఆయన తరచూ ముంబై నుంచి లేహ్‌కు బైక్‌పై వెళుతుంటారు. ఈ క్రమంలోనే లేహ్‌కు వెళ్లిన మూర్తి.. అక్కడ హర్ట్ ఎటాక్‌తో మరణించినట్లు తెలుస్తోంది. "నా ఫ్రెండ్, సహచరుడు, పలు విషయాల్లో నా గురువు అంబరీష్ మూర్తి ఇక లేరు. నిన్న రాత్రి ఆయన గుండెపోటుతో లేహ్‌లో చనిపోయారు" అని ఆశిష్ షా ట్వీట్ చేశారు.
ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఐఐఎం కోల్‌కతాలో ఎంబీఏ పట్టా పొందారు. 1996 జూన్‌లో వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించిన అంబరీష్ మూర్తి.. క్యాడ్‌బరీలో సేల్స్, మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా ప్రయాణం మొదలుపెట్టారు. ఇక్కడ దాదాపు ఐదున్నర ఏళ్లు పనిచేసిన అనంతరం.. ఆర్థికం రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రుడెన్షియల్ ఐసీఐసీఐ ఏఎంసీ (ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్)లో సరికొత్త ప్రయాణం మొదలు పెట్టారు. మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్‌లకు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. రెండేళ్లపాటు పనిచేసిన అనంతరం లెవీస్‌లో 5 నెలలు పనిచేశారు.
ఈ టైమ్‌లోనే తన సొంత వెంచర్ ఆరిజిన్ రిసోర్సెస్‌ను మొదలుపెట్టారు. ఈ పోర్టల్ భారతీయ మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు సాయం అందించేందుకు రూపొందించారు. అనంతరం 2005లో స్టార్టప్‌ను క్లోజ్ చేశారు. బ్రిటానియాలో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరారు. 7 నెలల అనంతరం ఈబే ఇండియాలో చేరారు. ఫిలిప్పీన్స్, మలేషియాలకు భారత్ మేనేజర్‌గా పని చేసి గుర్తింపుతెచ్చుకున్నా. ఆరేళ్ల అనంతరం మూర్తి 2011లో ఆశిష్ షాతో కలిసి పెప్పర్‌ఫ్రైని స్థాపించారు. ఆన్‌లైన్‌లో ఫర్నీచర్, హోమ్ డెకార్ ప్రొడక్ట్‌లను ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
Also Read: Ind vs WI 3rd T20 Updates: విండీస్‌తో నేడే మూడో టీ20.. ఓడితే సిరీస్ గోవిందా..!
Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి