Petrol price Today: మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ రేట్లు- కొత్త ధరలు ఇవే..
Petrol price Today: వాహనదారులకు చేదు వార్త. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రేట్లు ప్రియమయ్యాయి. హైదారాబాద్ సహా వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
Petrol Price in India: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క రోజు గ్యాప్ తర్వాత మళ్లీ పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనితో క్రూడ్ ఆయిల్ దిగుమతులపై పడుతున్న భారాన్ని.. వినియోగదారుnకు బదిలీ చేస్తున్నాయి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు.
దీనితో శుక్రవారం.. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు 75-90 పైసల మధ్య డీజిల్ ధరలు 76 నుంచి 87 పైసల మధ్య ప్రియమైంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ 80 పైసలు పెరిగింది. దీనితో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.97.85 వద్ద ఉంది. ఇక డీజిల్ ధర 80 పైసలు పెరిగి.. రూ.89.11 వద్ద విక్రయమవుతోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ 90 పైసలు పెరిగి రూ.108.18 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర 87 పైసలు పెరిగి.. రూ.97.22 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 88 పైసలు, 84 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్ పెట్రోల్ ధర రూ.111.66 వద్ద, డీజిల్ ధర లీటర్ రూ.97.68 వద్ద ఉన్నాయి.
ఇతర మెట్రో నగరాల్లో ఇంధన ధరలు..
చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ రూ.103.65 వద్ద (75 పైసలు పెరిగింది) ఉంది. లీటర్ డీజిల్ ధర 76 పైసలు పెరిగి 93.7 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో పెట్రోల్ ధర 85 పైసలు పెరిగి లీటర్ రూ.103.09 వద్ద విక్రయమవుతోంది. లీటర్ డీజిల్ ధర 78 పైసలు పెరిగి రూ.85.01 వద్దకు చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర లీటర్ రికార్డు స్థాయి వద్ద ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.109.98 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర 85 రూ.96.68 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 83 పైసలు, 80 పైసల చొప్పున పెరిగింది. దీనితో లీటర్ పెట్రోల్ రూ.107.16 వద్ద, డీజిల్ లీటర్ రూ.92.2 వద్ద ఉన్నాయి.
Also read: Disney plus hotstar: డిస్నీ+ హాట్‌స్టార్ అధ్యక్ష పదవిని వీడిన సునీల్ రాయన్!
Also read: Airtel Big Offer: ఉచితంగా ప్రైమ్, సోని లివ్ OTTసభ్యత్వం.. అదికూడా ఎయిర్‌టెల్ తో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook