Fuel Prices in States: దేశంలో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరల్నించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్గించింది. పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీగా తగ్గించింది. ఆ తరువాత రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు కూడా అదే బాటపట్టాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలాకాలంగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత రెండేళ్ల వ్యవధిలో పెట్రోల్ ధర లీటరుకు 40 రూపాయల వరకూ పెరగడంతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరల్నించి సామాన్యుడికి ఉపశమనం కల్గించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్-డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. లీటరు పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పెట్రోల్ లీటరుకు 9.50 రూపాయలు తగ్గగా, డీజిల్‌పై 7 రూపాయలు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ప్రకటన అనంతరం రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు సైతం పెట్రోల్-డీజిల్ ధరల్ని తగ్గించాయి.


కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన అనంతరం కేరళ, రాజస్థాన్ ప్రభుత్వాలు కూడా పెట్రోల్-డీజిల్ ధరల్ని తగ్గించాయి. కేరళ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై 2.41 రూపాయలు, లీటరు డీజిల్ పై 1.36 రూపాయలు తగ్గించగా..రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్‌పై 2.48 రూపాయలు, డీజిల్‌పై 1.16 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఫలితంగా రాష్ట్రంలో పెట్రోల్ ధర లీటరుకు 10.48 రూపాయలు, డీజిల్‌పై లీటరుకు 7.16 రూపాయలు తగ్గిపోయింది. 


ఇవాళ్టి పెట్రోల్-డీజిల్ ధరలు ఇలా


1. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 96.72 రూపాయలు కాగా డీజిల్ 89.62 రూపాయలు 
2. ముంబైలో పెట్రోల్ 111.35 రూపాయలు, డీజిల్ 97.28 రూపాయలు
3. చెన్నైలో పెట్రోల్ 102.63 రూపాయలు, డీజిల్ 94.24 రూపాయలు
4. కోల్‌కతాలో పెట్రోల్ 106.03 రూపాయలు, డీజిల్ 92.76 రూపాయలు
5. తిరువనంతపురంలో పెట్రోల్ 107.71 రూపాయలు, డీజిల్ 96.52 రూపాయలు
6. బెంగళూరులో పెట్రోల్ 101.94 రూపాయలు, డీజిల్ 87.89 రూపాయలు
7. భువనేశ్వర్‌లో పెట్రోల్ 109.66 రూపాయలు, డీజిల్ 97.82 రూపాయలు
8. హైదరాబాద్‌లో పెట్రోల్ 109.66 రూపాయలు, డీజిల్ 97.82 రూపాయలు


Also read: Todays Gold Rate: పసిడి ప్రియులకు షాక్, మరోసారి పెరిగిన బంగారం ధర, మే 22 ఇవాళ్టి బంగారం ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook