OPEC Decision: క్రూడ్ ఆయిల్ ధరలు వరుసగా నాలుగు నెలల్నించి పెరుగుతుండటంతో..ఒపెక్ దేశాలు క్రూడ్ ఆయిల్ ఉత్పాదన పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్-డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. ఇప్పుుడు ఇంధన ధరల విషయంలో మరో గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. అంతా సవ్యంగా సాగితే రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. 


బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 112-118 డాలర్లు


వాస్తవానికి క్రూడ్ ఆయిల్ ధరలు గత నాలుగు నెలల్నించి క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ధరల్ని తగ్గించేందుకు ఒపెక్ దేశాల సమాఖ్య కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 112-118 డాలర్లుగా ఉంది. గత 4 నెలల్లో క్రూడ్ ఆయిల్ ధర ఆకాశాన్నంటింది. ఆయిల్ ధరలు పెరగడంతో ధరల పెరుగుదల క్రమంగా పెరుగుతూ పోతోంది. అందుకే ఒపెక్ దేశాల సమాఖ్య ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. 


క్రూడ్ ఆయిల్ ధర తగ్గే అవకాశం


ఆయిల్ ఉత్పత్తి దేశాలు ఒపెక్ దేశాల సమాఖ్య, రష్టా సహా ఇతర భాగస్వామ్య దేశాలు జూలై-ఆగస్టు నుంచి క్రూడ్ ఆయిల్ ఉత్పాదన పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరల్లో తగ్గుదల రావచ్చు. జూలై-ఆగస్టు నెలల్లో ఒపెక్ దేశాలు 6.48 లక్షల బ్యారెళ్లు రోజుకు ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. 


ఒపెక్ దేశాలు తీసుకున్న ఈ నిర్ణయంతో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశాలున్నాయి. దీని ప్రభావం నిత్యావసర వస్తువుల పెరుగుదలతో ప్రభావితమై..ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులకు గురవుతున్న ఆర్ధిక వ్యవస్థకు కాస్త ఉపశమనం కలుగుతుంది. 2020లో కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గాయి. ఆ సమయంలో ధరల్ని స్థిరంగా ఉంచేందుకు ఒపెక్ దేశాలు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి తగ్గించాయి. 


ప్రస్తుతం ఒపెక్ దేశాలు రోజుకు 4.32 లక్షల బ్యారెళ్లు ప్రతిరోజూ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నాయి. వచ్చే నెల నుంచి 2.16 లక్షల బ్యారెళ్లు పెంచి..రోజుకు 6.48 లక్షల బ్యారెళ్లు ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. వాస్తవానికి ఒపెక్ దేశాలు అప్పుడే క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి పెంచాలని అనుకోలేదు. కానీ అమెరికాలో పెట్రోల్ ధర రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఈ నిర్ణయం తప్పలేదు. 2022 ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ అమెరికాలో క్రూడ్ ఆయిల్ ధర 54 శాతం ఖరీదుగా మారింది.


ఒపెక్ దేశాల నిర్ణయంతో న్యూయార్క్‌లో క్రూడ్ ఆయిల్ ధర 0.9 శాతం వరకూ పడిపోగా..114.26 డాలర్లకు చేరుకుంది. క్రూడ్ ఆయిల్ ఉత్పాదన పెంచడంతో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరల్లో తగ్గుదల కన్పిస్తుంది. దాంతోపాటు ధరలు కూడా తగ్గనున్నాయి.


Also read: Whatsapp New Features: వాట్సప్‌లో త్వరలో అందుబాటులో రానున్న ఆరు ప్రత్యేక ఫీచర్లు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook