Petrol Price Today In Hyderabad: రెండు రోజుల తరువాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర, ఢిల్లీ, ముంబైని మించిన హైదరాబాద్
Petrol Price Today In Hyderabad: సామాన్యులకు మళ్లీ వాత పడింది. పెట్రోల్ ధర లీటర్‌పై 26 పైసలు పెరగగా, డీజిల్ ధర 33 పైసలు ఎగబాకింది. అంతర్జాతీయు ముడిచమురు, విదేశీ మారకం రేటు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం(మే 10) నాడు ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి.
Petrol Price Today In Hyderabad: రెండు రోజుల విరామం తరువాత ఇంధన ధరలు నేడు పెరిగాయి. రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరల సవరింపులో భాగంగా సోమవారం(మే 10) నాడు ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. సామాన్యులకు మళ్లీ వాత పడింది. పెట్రోల్ ధర లీటర్‌పై 26 పైసలు పెరగగా, డీజిల్ ధర 33 పైసలు ఎగబాకింది. అంతర్జాతీయు ముడిచమురు, విదేశీ మారకం రేటు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేస్తాయి.
తాజాగా సవరించిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర(Petrol Price In Delhi) రూ.91.53కు చేరుకుంది. డీజిల్ ధర లీటర్ రూ.82.06 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వ్యాట్ ఆధారంగా ఆయా రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలలో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.86కు చేరుకోగా, డీజిల్ ధర లీటర్ రూ.89.17 అయింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.91.66, డీజిల్ దర రూ.84.90 అయింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.38 కాగా, డీజిల్ ధర రూ.86.96కు చేరింది.
Also Read: Tata Motors: కార్ల ధరలు పెంచేసిన టాటా మోటార్స్, లేటెస్ట్ రేట్లు ఇవే
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర(Petrol Price Today In Hyderabad) లీటర్‌పై 27 పైసలు మేర పెరగగా, డీజిల్ ధర 36 పైసలు మేర ఎగబాకింది. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.95.13కు చేరగా, డీజిల్ ధర రూ. 89.47 అయింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.32.98 కాగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం సేల్స్ ట్యాక్స్ రూ.19.55 విధిస్తుంది. డీజిల్ ధర రూ.31.83 నిర్ణయించగా, సెంట్రల్ ఎక్సైజ్ వ్యాట్ రూ.10.99 మరియు డీలర్ కమిషన్ పెట్రోల్ లీటర్‌పై రూ.2.6 రూపాయలు, డీజిల్‌పై రూ.2గా నిర్ణయించారు.
Also Read: COVID-19 Lockdown: నేటి నుంచి లాక్‌డౌన్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook