Petrol Price Today In Hyderabad : ఇంధన ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరల సవరింపులో భాగంగా మంగళవారం(మే 11) నాడు ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. సామాన్యుడి నెత్తిన పెట్రో పిడుగు మళ్లీ పడింది. పెట్రోల్ ధర లీటర్‌పై 27 పైసలు పెరగగా, డీజిల్ ధర 20 పైసలు ఎగబాకింది. అంతర్జాతీయు ముడిచమురు, విదేశీ మారకం రేటు పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించడానికి ఆధారం అవుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా సవరించిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.80కు చేరుకుంది. డీజిల్ ధర లీటర్‌ రూ.82.36 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వ్యాట్ ఆధారంగా ఆయా రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలలో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.12కు చేరుకోగా, డీజిల్ ధర లీటర్‌ రూ.89.48 అయింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.91.92, డీజిల్ దర రూ.85.20 అయింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.62 కాగా, డీజిల్ ధర రూ.87.25కు చేరింది. 


Also Read: Home Loan Mistakes: హోమ్ లోన్ తీసుకుంటున్నారా, అయితే ఈ 5 తప్పిదాలు చేయవద్దు


హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌పై 28 పైసలు మేర పెరగగా, డీజిల్ ధర 32 పైసలు మేర ఎగబాకింది. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.95.41కు చేరగా, డీజిల్ ధర రూ. 89.79 అయింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.32.98 కాగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం సేల్స్ ట్యాక్స్ రూ.19.55 విధిస్తుంది. డీజిల్ ధర రూ.31.83 నిర్ణయించగా, సెంట్రల్ ఎక్సైజ్ వ్యాట్ రూ.10.99 మరియు డీలర్ కమిషన్ పెట్రోల్ లీటర్‌పై రూ.2.6 రూపాయలు, డీజిల్‌పై రూ.2గా నిర్ణయించారు.


Also Read: EPFO: ఒక్క మిస్డ్ కాల్ ద్వారా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు EPF Balance పూర్తి వివరాలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook